భర్తతో ప్రియాంక రొమాంటిక్ పిక్: ఇది అతడి సొంతమైన పార్ట్ అంటూ.. అక్కడ హత్తుకున్న హీరోయిన్

చూపు తిప్పుకోకుండా చేయగల అందం.. కట్టి పడేసే నటనతో దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండియన్ సినిమాలో తన హవాను చూపిస్తోంది స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. చిన్న వయసులోనే తన గ్లామర్‌తో ప్రపంచాన్ని గెలిచిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత సినిమాల ద్వారా దేశంలోని ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ క్రమంలోనే అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌ను వివాహం చేసుకుంది.

అప్పటి నుంచి తన వ్యవహార శైలిని పూర్తిగా మార్చుకున్న ఈ బ్యూటీ.. గ్లామర్ షోతో పాటు రొమాన్స్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తన భర్త నిక్‌తో దిగిన రొమాంటిక్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి షాకిచ్చింది ప్రియాంక చోప్రా. ఇంకెందుకు ఆలస్యం? ఆ పిక్‌పై మీరూ ఓ లుక్కేయండి!

చిన్న వయసులోనే ప్రపంచ సుందరిగా

చిన్న వయసులోనే ప్రపంచ సుందరిగా

చదువుకుంటోన్న రోజుల్లోనే అంటే చాలా చిన్న వయసులోనే పలువురు సెలెబ్రిటీల సలహా మేరకు మోడల్‌గా తన కెరీర్‌ను ఆరంభించింది ప్రియాంక చోప్రా. ఈ క్రమంలోనే అప్పట్లోనే ఎన్నో అందాల పోటీల్లో పాల్గొంది. అలా తన అందచందాలతో దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న ఈ బ్యూటీ.. 2000లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. తద్వారా ప్రపంచ సుందరి కిరీటాన్ని అందుకుంది. దీంతో ఈ అమ్మడు చిన్న వయసులోనే ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయింది. ఫలితంగా భారతదేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించింది.

అవకాశాల వెల్లువ.. సినిమాల్లోకి ఎంట్రీ

అవకాశాల వెల్లువ.. సినిమాల్లోకి ఎంట్రీ

మిస్ వరల్డ్‌గా విజయం సాధించిన తర్వాత ప్రియాంక చోప్రా ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. దీంతో ఆమెకు సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 2002లో 'తమీజాన్' అనే తమిళ చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. అక్కడి నుంచి వెనుదిరిగి చూడకుండా దాదాపు ఇరవై ఏళ్లుగా తన హవాను చూపిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నో అవార్డులు సైతం అందుకుందీ బ్యూటీ. అలా దేశంలోని దాదాపు అన్ని ఇండస్ట్రీల్లోనూ నటించింది.

అక్కడికెళ్లింది.... ప్రేమలో పడిపోయింది

అక్కడికెళ్లింది.... ప్రేమలో పడిపోయింది

ఇండియాలోని చాలా భాషల్లో నటించి దేశ వ్యాప్తంగా తన స్టామినాను చూపించిన ప్రియాంక చోప్రా.. ఇదే క్రమంలో హాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. కొన్నేళ్ల క్రితమే అక్కడ అడుగు పెట్టిన ఈ భామ.. పలు వెబ్ సిరీస్‌లతో పాటు కొన్ని ఆంగ్ల చిత్రాల్లోనూ నటించింది. అలాగే, ప్రైవేట్ ఆల్బమ్‌లను కూడా చేసింది. హాలీవుడ్‌లో బిజీ బిజీగా ఉన్న సమయంలోనే ప్రియాంక చోప్రా.. తన కంటే వయసులో చిన్నోడు అయిన అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌తో ప్రేమలో పడిపోయింది.

పెళ్లికి ముందే రొమాన్స్.. అలా ఒక్కటైంది

పెళ్లికి ముందే రొమాన్స్.. అలా ఒక్కటైంది

నిక్ జోనస్‌తో డేటింగ్ చేస్తున్న సమయంలోనే ప్రియాంక చోప్రా చాలా సార్లు విదేశీ మీడియా కెమెరాలకు చిక్కింది. పబ్లిక్‌లోనే ముద్దులు పెట్టుకోవడం.. హగ్స్ చేసుకోవడం.. చెట్టాపట్టాలేసుకుని తిరగడం వంటివి చేయడంతో ఈ అమ్మడు అప్పట్లో అక్కడ ఫేమస్ అయింది. చాలా రోజుల పాటు అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ఇండియాలో వివాహం చేసుకుంది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చారు.

అందులో మాత్రం ఫుల్ బిజీ.. భర్త కోసం

అందులో మాత్రం ఫుల్ బిజీ.. భర్త కోసం

వయసులో చిన్నోడే అయినా నిక్ జోనస్‌ను ఎంతగానో ప్రేమించింది ప్రియాంక చోప్రా. ఇదే విషయాన్ని ఆమె ఎన్నోసార్లు స్వయంగా వెల్లడించింది. అంతేకాదు, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు నిక్‌తో దిగిన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. అలాగే, ఎప్పుడైనా అతడికి దూరంగా ఉన్నా ఆ విరహ వేదనను వివరిస్తూ పోస్టులు కూడా పెడుతోంది. దీంతో ఈ అమ్మడు తరచూ హాట్ టాపిక్ అవుతోంది.

అందాల ఆరబోతతో హాట్ టాపిక్‌గా పీసీ

అందాల ఆరబోతతో హాట్ టాపిక్‌గా పీసీ

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రియాంక చోప్రా.. తరచూ తనకు సంబంధించిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది. ఇందులో భాగంగానే అందాలను ఆరబోస్తూ దిగిన పిక్స్‌ను ఎక్కువగా వదులుతోంది. మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఈ అమ్మడు మరింతగా రెచ్చిపోతోంది. అదే సమయంలో భర్తతో రొమాన్స్ చేస్తున్నవి కూడా అప్పుడప్పుడూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అందుకే ఈ బాలీవుడ్ భామ పేరు నిత్యం హాట్ టాపిక్ అవుతోంది. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది.

Recommended Video

Kiran Abbavaram Birthday Special Interview | SR Kalyanamandapam | Sammathame
భర్తకు ప్రియాంక చోప్రా హగ్.. అలా పోస్ట్

భర్తకు ప్రియాంక చోప్రా హగ్.. అలా పోస్ట్

తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియాంక చోప్రా ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె తన భర్త నిక్ జోనస్‌ను ఎద భాగంలో హత్తుకుని ఉంది. ఈ రొమాంటిక్ ఫొటోకు తోడుగా 'అతడు తనకిష్టమైన ప్రదేశంలో ఉన్నాడు' అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. అంటే తన హృదయంలో భర్తకు ఇల్లు కట్టేసినట్లు పరోక్షంగా చెప్పింది. దీంతో ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఫలితంగా ఈ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X