For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రియాంక చోప్రా పర్సనల్ సీక్రెట్స్ లీక్: ఆ ఒక్క మెసేజ్‌తో డేటింగ్.. పెళ్లికి ముందే చాలాసార్లు అలా!

  |

  ఐదు కాదు.. పది కాదు.. దాదాపు ఇరవై ఏళ్లుగా ఇండియన్ సినిమాలో తన ప్రభావాన్ని చూపిస్తూ స్టార్‌గా వెలుగొందుతోంది గ్లామరస్ క్వీన్ ప్రియాంక చోప్రా. చిన్న వయసులోనే తన అందంతో ప్రపంచం మొత్తాన్ని ఫిదా చేసిన ఈ భామ.. ఎన్నో సినిమాల్లో మంచి మంచి పాత్రలతో ప్రేక్షకులను మాయ చేసింది. హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నిక్ జోనస్‌తో ప్రేమాయణం సాగించి.. వివాహం చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె లవ్ స్టోరీ సీక్రెట్స్ బయటకు వచ్చాయి. నిక్‌ చేసిన ఒక్క మెసేజ్‌తో కథ మొదలైంది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీ అందరి కోసం!

  టీనేజ్‌లోనే ప్రపంచాన్ని గెలిచిన భామ

  టీనేజ్‌లోనే ప్రపంచాన్ని గెలిచిన భామ

  చదువుకుంటోన్న రోజుల్లోనే ప్రియాంక చోప్రా మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే జాతీయ స్థాయి అందాల పోటీల్లో పాల్గొని విజయం సాధించింది. ఈ క్రమంలోనే 2000లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచింది. తద్వారా ప్రపంచ సుందరి కిరీటాన్ని అందుకుంది. తద్వారా దేశానికి కూడా మంచి గుర్తింపును ఖ్యాతిని తీసుకొచ్చిందీ బ్యూటీ.

   హీరోయిన్‌గా ఎంట్రీ.. సినిమాల్లో హవా

  హీరోయిన్‌గా ఎంట్రీ.. సినిమాల్లో హవా

  మిస్ వరల్డ్‌గా గెలిచిన తర్వాత ప్రియాంక చోప్రాపై అన్ని ఇండస్ట్రీల కన్ను పడింది. ఈ క్రమంలోనే 2002లో ‘తమీజాన్' అనే తమిళ చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. అక్కడి నుంచి వెనుదిరిగి చూడకుండా దాదాపు ఇరవై ఏళ్లుగా తన హవాను చూపిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నో పురష్కారాలను తన ఖాతాలో వేసుకుందామె.

  హాలీవుడ్ ప్రవేశం.. ప్రేమలో పడిందిగా

  హాలీవుడ్ ప్రవేశం.. ప్రేమలో పడిందిగా

  దేశంలోని దాదాపు అన్ని భాషల్లోనూ నటించి మెప్పించిన ప్రియాంక చోప్రా.. కొన్నేళ్ల క్రితం హాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే పలు వెబ్ సిరీస్‌లతో పాటు కొన్ని చిత్రాల్లోనూ నటించింది. అలాగే, ప్రైవేట్ ఆల్బమ్‌లు కూడా చేసింది. అక్కడ కెరీర్‌ను సాగిస్తోన్న సమయంలోనే నిక్ జోనస్ అనే అమెరికన్ పాప్ సింగర్‌తో ప్రేమలో పడిపోయింది ప్రియాంక చోప్రా.

  గ్లామర్ డోస్ పెంచేసి రచ్చ చేసిన కంగనా రనౌత్: ఘాటు ఫోజులతో ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన ఫైర్ బ్రాండ్‌

  వయసులో చిన్నోడిని పెళ్లాడిన బ్యూటీ

  వయసులో చిన్నోడిని పెళ్లాడిన బ్యూటీ

  వయసులో చిన్నోడే అయినప్పటకీ ప్రియాంక చోప్రా నిక్ జోనస్‌తో చాలా కాలం పాటు డేటింగ్ చేసింది. ఇలా చాలా సార్లు విదేశీ మీడియా కెమెరాలకు చిక్కింది. పబ్లిక్‌లోనే ముద్దులు పెట్టుకోవడం.. హగ్స్ చేసుకోవడం వంటివి చేసింది. ఈ క్రమంలోనే ఇండియాలో అతడిని వివాహం చేసుకుంది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లికి సినీ, రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులు హాజరయ్యారు.

  ప్రియాంక.. నిక్ ప్రేమకథ పుట్టింది ఇలా

  ప్రియాంక.. నిక్ ప్రేమకథ పుట్టింది ఇలా

  నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకోడానికి ముందే ప్రియాంక చోప్రా అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిందన్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరి లవ్ స్టోరీ గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. అందరూ అనుకున్నట్లు వీళ్లిద్దరూ 2017లో కలుసుకోలేదట. అంతకు ముందే అంటే 2016లో సోషల్ మీడియా ద్వారా వీళ్లిద్దరూ పరిచయం అయ్యారని నిక్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

  ఒక్క మెసేజ్‌తో డేటింగ్... పెళ్లికి ముందే

  ఒక్క మెసేజ్‌తో డేటింగ్... పెళ్లికి ముందే

  2016లో నిక్ జోనస్ ట్విట్టర్ ద్వారా ప్రియాంకకు మెసేజ్ చేశాడట. అందులో ఆమె మొబైల్ నెంబర్ ఇవ్వమని కోరాడట. దీనికి వెంటనే స్పందించిన ఈ బ్యూటీ.. నెంబర్ ఇవ్వడంతో అప్పటి నుంచి చాటింగ్ చేసుకోవడం మొదలు పెట్టారని తెలిసింది. అలా పెళ్లికి ముందు చాలా కాలం పాటు వీళ్లిద్దరూ మొబైల్‌తో సంభాషణలు జరుపుకున్నారని.. ఆ తర్వాత 2017లో తొలిసారి కలిశారని టాక్.

  Priyanka Chopra స్టన్నింగ్ ఫోటోలు... భర్తతో పీకల్లోతు రొమాన్స్‌లో మునిగి తేలేతూ..

  మొదటిసారి కలిసింది అక్కడే.. డేటింగ్

  మొదటిసారి కలిసింది అక్కడే.. డేటింగ్

  చాలా కాలం పాటు చాటింగ్ చేసుకున్న ప్రియాంక చోప్రా.. నిక్ జోనస్.. 2017 జరిగిన ఆస్కార్ అవార్డుల ఫంక్షన్‌లో తొలిసారి ముఖాముఖీగా కలుసుకున్నారట. అంతేకాదు, ఆ తర్వాత అతడు అందరి ముందే మోకాళ్లపై కూర్చుని ఆమెకు ప్రపోజ్ చేశాడని తెలిసింది. దీంతో అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య డేటింగ్ ప్రారంభం అయిందట. అలా ఆ తర్వాత కొన్నేళ్లకు పెళ్లితో ఒక్కటయ్యారు.

  English summary
  Bollywood Star Actress Priyanka Chopra Nick Jonas Love Stroy Start From 2016. He Asked her Mobile Number in Twitter Chat. after that She Gave her Number.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X