Priyanka Chopra కూతురు ఎలా ఉందో చూశారా? క్యూట్‌గా ముద్దు ముద్దుగా!
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గారాలపట్టి మాల్టీ మేరీ చోప్రా జోనస్ ముఖాన్ని చూపించకుండా కొన్నినెలలుగా ఊరిస్తూ వచ్చింది. గతేడాది సరోగసి ద్వారా నెలలు నిండకుండా పుట్టిన కూతుర్ని చాలా నెలలు ఇంక్యూబెటర్‌లోనే ఉంచి.. ఆరోగ్యాన్ని సంరక్షించారు. చాలా రోజులపాటు చిల్డ్రన్ హాస్పిటల్‌లో ఉంచారు. సుమారు ఆరు నెలల తర్వాత ఇంటికి తీసుకొచ్చి.. ఆ తర్వాత మాల్టీ మేరీ చోప్రా జోనస్ నామకరణం చేశారు.
అప్పటి నుంచి మాల్టీని అల్లారు ముద్దుగా చేసుకొంటున్నారు. తన కూతురు ముఖాన్ని చూపించకుండా, మీడియా కంటపడకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు. చిట్టచివరకు తన కూతురుకి ఏడాది పూర్తయిన తర్వాత మాల్టీ ముఖాన్ని సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసింది.
ఇటీవల జోనస్ బ్రదర్స్ వాక్ ఆఫ్ ది ఫేమ్ వేడుకకు జోనస్ బ్రదర్స్ హాజరైన సందర్భంగా మాల్టీని చూపించింది. ఇక మాల్టీ మేరీ చోప్రా జోనస్ క్రీమ్ కలర్ డ్రస్సులో ముద్దొచ్చిలా ఉంది. తలపై క్రీమ్ కలర్ మ్యాచింగ్‌తో హెయిర్ బ్యాండ్ పెట్టుకొని క్యూట్‌గా కనిపించింది.

తన కూతురుతో కలిసి ప్రియాంక ఆడుకొంటుండగా.. అల్లరి ఆపండి అంటూ జోనస్ అరిచాడు. ఇలాంటి వీడియోను ప్రియాంక చోప్రా షేర్ చేసింది. దాంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. అయితే మాల్టీ మేరీ చోప్రాను చూసిన అభిమానులు క్రేజీ కామెంట్లు పెట్టారు. అచ్చం తండ్రికి జిరాక్స్ కాపీలా ఉందని కామెంట్ చేశారు.
ఇక ప్రియాంక చోప్రా విషయానికి వస్తే.. ఇటీవల అమెరికాలో గ్లోల్టెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమంలో ఈ గ్లోబల్ స్టార్ పాల్గొన్నది. ఆ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించింది. రాజమౌళి టీమ్‌తో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నది.


Click it and Unblock the Notifications











