For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నిక్ జోనస్‌తో ప్రియాంక చోప్రా రచ్చ: డార్క్ రూమ్‌లో ఒకరిపై ఒకరు.. పర్సనల్ ఫొటో వైరల్!

  |

  ప్రియాంక చోప్రా.. సినీ ప్రియులకు ఈ పేరుతో పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ బ్యూటీ దాదాపు రెండు దశాబ్దాలుగా తనదైన శైలి యాక్టింగ్‌తో పాటు చూపు తిప్పుకోకుండా చేయగల అందంతో ఇండియన్ సినిమాపై హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. ఇక, కొన్నేళ్లు క్రితమే నిక్ జోనస్ అనే పాప్ సింగర్‌ను ప్రేమ వివాహం చేసుకున్న ప్రియాంక.. తరచూ అతడితో రొమాన్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. అదే సమయంలో వీళ్లిద్దరూ తమ ప్రేమను సోషల్ మీడియా ద్వారా వ్యక్త పరుచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నిక్.. ప్రియాంకతో దిగిన ఓ పర్సనల్ రొమాంటిక్ ఫొటోను వదిలాడు. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ ఓ లుక్కేయండి!

  చిన్న వయసులోనే ప్రపంచ సుందరిగా

  చిన్న వయసులోనే ప్రపంచ సుందరిగా

  టీనేజ్‌లోనే ప్రియాంక చోప్రా పలువురు పెద్దల సలహా మేరకు మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే జాతీయ స్థాయి అందాల పోటీల్లో పాల్గొని విజయం సాధించింది. అనంతరం 2000లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. తద్వారా ప్రపంచ సుందరి కిరీటాన్ని అందుకుంది. దీంతో భారతదేశ కీర్తిని విశ్వ వ్యాప్తం చేసేసిందీ అందాల సుందరాంగి. అప్పటి నుంచి ఈ అమ్మడు పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమ్రోగిపోతోంది.

  కొత్తలో నరకం అనుభవించా.. దానివల్ల పిల్లలు కూడా పుట్టరని భయపడ్డా: రోజా సంచలన వ్యాఖ్యలు

  హీరోయిన్‌గా పరిచయం.. స్టార్‌గా ఎదిగి

  హీరోయిన్‌గా పరిచయం.. స్టార్‌గా ఎదిగి

  మిస్ వరల్డ్‌గా గెలిచిన తర్వాత ప్రియాంక చోప్రా సినీ పరిశ్రమల్లోని దర్శక నిర్మాతల దృష్టిలో పడిపోయింది. దీంతో ఆమెకు సినిమాల ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 2002లో ‘తమీజాన్' అనే తమిళ చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత పలు భాషల్లో నటించింది. అలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ప్రియాంక చోప్రా.. నిన్న మొన్నటి వరకూ వరుస సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

  హాలీవుడ్‌లోకి ఎంట్రీ... ప్రేమలో పడింది

  హాలీవుడ్‌లోకి ఎంట్రీ... ప్రేమలో పడింది

  సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన ప్రియాంక చోప్రా.. కొన్నేళ్ల క్రితం హాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. ఇండియాలో మరెవరికీ సాధ్యం కాని రీతిలో అక్కడ కూడా ఈ అమ్మడు హవాను చూపించింది. ఈ క్రమంలోనే అందులో పలు వెబ్ సిరీస్‌లతో పాటు కొన్ని చిత్రాల్లోనూ నటించి సత్తా చాటింది. అలాగే, ప్రైవేట్ ఆల్బమ్‌లు కూడా చేసింది. అక్కడ కెరీర్‌ను సాగిస్తోన్న సమయంలోనే నిక్ జోనస్ అనే అమెరికన్ పాప్ సింగర్‌తో ప్రేమలో పడిపోయిందీ బాలీవుడ్ భామ.

  బ్రా ఒక్కటే ధరించి విష్ణుప్రియ రచ్చ: ఇంతకు ముందెన్నడూ చూడనంత ఘాటు ఫోజులతో!

  ఏజ్‌ తేడా ఉన్నా అతడిని పెళ్లాడిందిగా

  ఏజ్‌ తేడా ఉన్నా అతడిని పెళ్లాడిందిగా

  తనకంటే వయసులో చిన్నోడే అయినప్పటకీ ప్రియాంక చోప్రా నిక్ జోనస్‌తో చాలా కాలం పాటు డేటింగ్ చేసింది. ఇలా చాలా సార్లు విదేశీ మీడియా కెమెరాలకు చిక్కింది. పబ్లిక్‌లోనే ముద్దులు పెట్టుకోవడం.. హగ్స్ చేసుకోవడం వంటివి చేసింది. ఈ క్రమంలోనే ఇండియాలో అతడిని వివాహం చేసుకుంది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లికి సినీ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చారు. దీంతో అప్పట్లో ఈ వేడుక అంతర్జాతీయ స్థాయిలో హైలైట్ అయిపోయింది.

  ఎప్పుడూ భర్తతోనే ఉంటూ.. పాపులర్

  ఎప్పుడూ భర్తతోనే ఉంటూ.. పాపులర్

  ప్రియాంక చోప్రా వివాహం తర్వాత లండన్‌కు మకాం మార్చేసింది. ఇండియాలో ఐదైనా షూటింగ్‌ కానీ, ఇతర పనులు కానీ ఉంటేనే స్వదేశానికి వస్తుంది. లేదంటే అక్కడే కాలం గడుపుతోంది. మరీ ముఖ్యంగా ఎప్పుడూ భర్త నిక్ జోనస్‌తోనే ఎక్కువ సమయాన్ని గడుపుతోంది. ఈ క్రమంలోనే అతడికి ముద్దులు, హగ్గులు ఇస్తూ ప్రియాంక చోప్రా తరచూ ప్రేమను వ్యక్త పరుచుకుంటోంది. దీంతో తన భర్త అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసేలా పోస్టులు పెడుతోంది. ఫలితంగా నిత్యం ఈ అమ్మడు వార్తల్లోనే ఉంటోంది.

  అనసూయకు నెలలు అంటూ అభి సంచలన వ్యాఖ్యలు: ప్రెగ్నెన్సీపై అందరి ముందే ఊహించని ఆన్సర్

  Salaar : Prabhas తో Priyanka Chopra స్పెషల్ సాంగ్.. భారీగానే ఆఫర్ చేశారు..!!
  సోషల్ మీడియాలో ఇద్దరూ రచ్చ చేస్తూ

  సోషల్ మీడియాలో ఇద్దరూ రచ్చ చేస్తూ

  ప్రియాంక చోప్రా.. నిక్ జోనస్ ఇద్దరూ ఇంటర్నేషనల్ రేంజ్ ఉన్న వాళ్లే. అందుకే వీళ్లిద్దరికీ సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అందుకు అనుగుణంగానే ఈ జంట ఎప్పుడూ అందులో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తమ తమ కెరీర్‌లకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకోవడంతో పాటు పర్సనల్ ఫొటోలను ఎప్పుడూ షేర్ చేస్తున్నారు. వాటిలో ఎక్కువగా రొమాన్స్ చేస్తున్న ఫొటోలు, వీడియోలే ఉంటున్నాయి. ఇలా హాట్ టాపిక్ అవుతున్నారు.

  రొమాంటిక్ ఫొటోను వదిలిన నిక్ జోనస్

  రొమాంటిక్ ఫొటోను వదిలిన నిక్ జోనస్

  పాప్ సింగర్ నిక్ జోనస్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేశాడు. డార్క్ రూమ్‌లో బ్లాక్ అండ్ వైట్ ఫిల్టర్‌లో తీసిన ఈ పిక్‌లో ప్రియాంక చోప్రా అతడి మీద కూర్చుని ఉంది. అంతేకాదు, ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ లిప్ లాక్ చేసుకోడానికి సిద్ధంగా ఉన్నట్లు ఫోజు ఇచ్చారు. ఇక, ఈ ఫొటోను షేర్ చేసిన నిక్ ‘ఆ టూర్ గుర్తుందా' అనే క్యాప్షన్ పెట్టాడు. ఎంతో రొమాంటిక్‌గా ఉన్న ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఈ ఫొటో చాలా తక్కువ సమయంలో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోయింది.

  English summary
  Bollywood Star Actress Priyanka Chopra Husband Nick Jonas Very Active in Social Media. Recently He Shared Romantic Personal Photo In Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X