దటీజ్ ప్రియాంక చోప్రా.. పెళ్లి కూడా వ్యాపారంగానే..
బాలీవుడ్ అందాల సుందరి ప్రియాంక చోప్రా, హాలీవుడ్ నటుడు నిక్ జోనస్ పెళ్లికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే పెళ్లికి ముందు జరిపించే కార్యక్రమాలు జోష్‌గా సాగుతున్నాయి.
నవంబర్‌లో వీరి పెళ్లి రాజస్థాన్‌లో జరుగనున్న సంగతి తెలిసిందే. సాధారణంగా సినీ తారల పెళ్లికి సంబంధించిన ఫొటోలను షూట్ చేయడానికి పెద్ద సంస్థలు పోటీ పడటం సహజం. ప్రియాంక విషయంలో కూడా ఇదే జరిగిందట.

తనకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని మ్యారేజ్ ఫొటోల కాంట్రాక్టుకు ఇచ్చి ప్రియాంక భారీగానే వెనుకేసుకొందట. ప్రియాంక పెళ్లి ఫోటోల ఒప్పందాన్ని 2.5 మిలియన్ డాలర్లు చెల్లించి ఓ అంతర్జాతీయ మ్యాగజైన్ సొంతం చేసుకొన్నట్టు సమాచారం.
అయితే ఏ మ్యాగజైన్ హక్కులను సొంతం చేసుకొన్నదనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. కానీ ఆ ప్రముఖ కంపెనీ మాత్రం పెళ్లి ఫోటోలతో సోషల్ మీడియాను అదరగొట్టడం ఖాయమంటున్నారు.


Click it and Unblock the Notifications











