అనుదీప్ పరువుపాయే.. కాస్ట్‌లీ గిఫ్ట్ అంటూ బక్రా.. నిర్మాతలే ‘జాతి రత్నాలు’
జాతిరత్నాలు సినిమా, అందులోని పంచ్‌లు, సెటైర్లు ఎంతలా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసింది. జాతిరత్నాలు సినిమా కంటే ఆ మూవీ డైరెక్టర్ అనుదీప్ మరింతగా ఫేమస్ అయ్యాడు. బుల్లితెరపై అనుదీప్ చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు.స్టేజ్ మీద ఎక్కినా, ఇంటర్వ్యూలు ఇచ్చినా సరే అందులో అనుదీప్ తన స్టైల్లో సమాధానాలు ఇస్తుంటాడు.తెలియకుండానే పంచ్‌లు వేస్తుంటాడు. అలాంటి అనుదీప్‌ను జాతి రత్నాలు నిర్మాతలు బక్రాను చేసేశారు.

మామూలుగా అలా..
మామూలుగా అయితే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే చిత్ర నిర్మాతలు దర్శకుడికి ఏదో ఒక బహుమతి ఇస్తుంటారు. ఇది ఇప్పుడు టాలీవుడ్‌లో ఆనవాయితీగా మారింది. మొన్నా మధ్య ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ అయితే.. మైత్రీ వారు బుచ్చిబాబుకు బెంజ్ కారును బహుమతిగా ఇచ్చారు.

తాజాగా ఇలా..
ఇండియాలో తాజాగా ఓ బ్రాండెడ్ కారు ఎక్కువగా హల్చల్ చేసింది. ప్రభాస్ కొన్ని కొత్త కారు లంభోర్గిని గురించి అందరికీ తెలిసిందే. ఆ వీడియోలు, ప్రభాస్ కొట్టిన చక్కర్లు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. దాదాపు ఆరు కోట్ల విలువైన ఆ కారు ఇండియాలో రెండోది. అది కూడా ప్రభాస్ ఇంట్లోనే ఉంది.

లంభోర్గిని అంటూ...
జాతి రత్నాలు సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం, ఊహించిన దాని కంటేఎక్కువగా లాభాలు రావడంతో నిర్మాతలు దర్శకుడికి గిఫ్ట్ ఇస్తామని చెప్పినట్టున్నారు. అలా ఇంటికి పిలిచి మరీ పరువుతీసినట్టు కనిపిస్తోంది.అచ్చం తాను ఎదుటివారిని బక్రాలను చేసిన విధంగానే అనుదీప్‌ను నిర్మాతలైన స్వప్నా, ప్రియాంక్ దత్‌లు బక్రా చేసేశారు.

బొమ్మ కారు ఇచ్చి..
లంభోర్గిని కారు అంటూ బొమ్మను ప్రజెంట్ చేశారు. మొత్తానికి ప్రియాంక దత్, స్వప్నా దత్‌లు నిజమైన జాతి రత్నాలు అని అనిపించుకున్నారంటూ రకరకాల ట్రోల్స్, మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ బాగానే ఉన్నాయ్ గాని నిజంగానే దర్శకుడికి నిర్మాతలు విలువైన బహుమతి ఇస్తారో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











