‘అరవింద..’ పబ్లిక్ టాక్: కొత్త ఎన్టీఆర్, చంపడం నచ్చలేదు, ఇంట్రో మిస్సవ్వొద్దు

Recommended Video

Aravinda Sametha Movie Public Talk అరవింద సమేత పబ్లిక్ టాక్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అరవింద సమేత' చిత్రం బాక్సాఫీసు వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ప్రసాద్ ఐమాక్స్ వద్ద సినిమా చూసిన ప్రేక్షకుల నుండి అభిప్రాయ సేకరణ చేసినపుడు ఆసక్తికర అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. చాలా మంది సినిమా బ్లాక్ బస్టర్ అని తేల్చేశారు. అయితే ఒకరిద్దరు మాత్రం జస్ట్ ఓకే విధంగా ఉందని తెలిపారు. సినిమాలో తమకు నచ్చిన అంశాలతో పాటు నచ్చని అంశాలను సైతం నిర్మొహమాటంగా చెప్పేశారు.

 అజ్ఞాతవాసి కంటే బెటర్ మూవీ

అజ్ఞాతవాసి కంటే బెటర్ మూవీ

ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అజ్ఞాతవాసితో పోలిస్తే ఇది చాలా బెటర్ మూవీ. ఫస్టాఫ్ కొంచెం స్లోగా ఉన్నా సెకండాఫ్ ఫుల్ పీక్స్‌లోకి తీసుకెళ్లాడు. జగపతి బాబు యాక్షన్ అదిరిపోయింది.

 ఇంట్రో మిస్సవ్వొద్దు

ఇంట్రో మిస్సవ్వొద్దు

చాలా మంది ఈ సినిమా క్లైమాక్స్ గురించే మాట్లాడుతున్నారు. కానీ అంతకంటే హైలెట్‌గా ఎన్టీఆర్ ఇంట్రోడక్షన్ సీన్ ఉంది. సినిమా మొదలైన తర్వాత 20 నిమిషాలు అస్సలు విస్సవ్వొద్దు. రాజమౌళి చెప్పినట్లు త్రివిక్రమ్ ఒక మాస్ సినిమా తీసి తన సత్తా నిరూపించుకున్నారు.

క్లైమాక్స్ అల్టిమేట్

క్లైమాక్స్ అల్టిమేట్

సినిమా ఫస్టాఫ్, సెకండాఫ్ రెండూ బావున్నాయి. క్లైమాక్స్ అల్టిమేట్ అనేలా ఉంది. ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్, జగపతి బాబు పెర్ఫార్మెన్స్ సినిమాకు మేజర్ హైలెట్.

ఐదు మార్కులు వేస్తా

ఐదు మార్కులు వేస్తా

సినిమా మొత్తం బావుంది. ఈ సినిమాకు ఐదుకు ఐదు మార్కులు ఇస్తాను. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక మంచి సినిమా వచ్చింది.

ఎన్టీఆర్ మాత్రమే సూటవుతాడు

ఎన్టీఆర్ మాత్రమే సూటవుతాడు

ఫ్యాక్షన్ సినిమాలో ఒక కొత్త కోణం చూపించారు. ఒక యంగస్టర్ వచ్చి గొడవలు ఆపడానికి చేసే ప్రయత్నం బావుంది. సినిమాలో త్రివిక్రమ్ డైలాగులు బావున్నాయి. అవి ఎన్టీఆర్ కు తప్ప మరెవరికీ సూటవ్వవు.

చంపడం నచ్చలేదు

చంపడం నచ్చలేదు

సినిమా బావుంది కానీ... ముగింపు కాస్త నిరాశ పరిచింది. చివర్లో విలన్ ను చంపడం అనేది కరెక్ట్ కాదు. గొడవలు కాకుండా అందరినీ రియలైజ్ చేయాలనేది సినిమా ఉద్దేశ్యం. అలాంటపుడు అది లాస్ట్ పర్సన్ వరకు రీచ్ అవ్వాలి. కానీ విలన్ ను మార్చలేక చంపేయడం నాకు నచ్చలేదు. ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ బావుంది.

ఎన్టీఆర్ అభిమానులకు పండగలా ఉంటుంది

ఎన్టీఆర్ అభిమానులకు పండగలా ఉంటుంది

సినిమా చాలా బావుంది. దర్శకుడు త్రివిక్రమ్ అజ్ఞాతవాసి చిత్రాన్ని ఎంత వరస్ట్ గా తీశాడో... ‘అరవింద సమేత'ను అంత గొప్పగా తీశారు. ఎన్టీఆర్ అభిమానులకు పండగలా ఉంటుంది.

 సునీల్ చివరి వరకు

సునీల్ చివరి వరకు

సినిమా అంతా బావుంది. ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జగపతి బాబు క్యారెక్టర్ హైలెట్ అనేలా ఉంది. సినిమాకు ఎన్టీఆర్ ఒక ఎత్తయితే, జగపతి బాబు మరొక ఎత్తు. స్టోరీ నేరేషన్ బావుంది. ఎన్టీఆర్ డాన్స్, పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. సునీల్ మొదటి నుంచి చివరి వరకు ఉండటం బావుంది

మంచి మూవీ, గొప్ప మూవీ అయితే కాదు

మంచి మూవీ, గొప్ప మూవీ అయితే కాదు

సినిమాలో క్లైమాక్స్ బాగా నచ్చింది. లేడీస్ గురించి చెప్పిన డైలాగ్ బావుంది. ఓవరాల్ గా గుడ్ ఫిల్మ్. అయితే గొప్ప సినిమా అయితే కాదు. ఎక్స్ పెక్ట్ చేసినంత అయితే లేదు. ఒక్కసారి చూడొచ్చు.

 కొత్త ఎన్టీఆర్ కనిపిస్తాడు

కొత్త ఎన్టీఆర్ కనిపిస్తాడు

సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ హైలెట్ అనేలా ఉన్నాయి. అత్తారింటికి దారేది తర్వాత త్రివిక్రమ్ వండర్ ఫుల్ హిట్ ఇచ్చాడు. ఎన్టీఆర్ యాక్షన్ సీక్వెన్స్ లో కొత్త కోణం చూపించారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్త ఎన్టీఆర్ ను పరిచయం చేశారు. జగపతి బాబుకు పాత్ర అద్భుతంగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X