ఎంగేజ్మెంట్ రింగ్ షేర్ చేసిన పునర్నవి.. ఆ పెళ్లిపై నెటిజన్లకు ఎన్నో అనుమానాలు!
పునర్నవి రాహుల్ గురించి వచ్చినన్నీ వార్తలు మరెతర జంటపై వచ్చి ఉండవు. బిగ్ బాస్ మూడో సీజన్ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది ఈ జంట. ఈ ఇద్దరి వల్ల షోకు హైప్ వచ్చిందనడంలోనూ అతిశయోక్తి ఏ మాత్రం లేదు. వీరి రహస్య బంధాన్ని బిగ్ బాస్ టీం కూడా బాగానే ప్రొజెక్ట్ చేసింది. ముఖ్యంగా హోస్ట్‌గా ఉన్న నాగార్జున ఇద్దరిని బాగా ఎంకరేజ్ చేసినట్టు కనిపిస్తుంది. ఇక పునర్నవి రాహుల్ కెమిస్ట్రీకి జనాలు ఓ రేంజ్‌లో కనెక్ట్ అయ్యారు. ఆ షోలోనూ రాహుల్ ఎన్నోసార్లు ప్రపోజ్ చేశాడు. ఆట పట్టించాడు. పునర్నవితో సరసాలు ఆడాడు. ఆమె కోసం ఎన్నో త్యాగాలు కూడా చేశాడు. అలాంటి పునర్నవి తాజాగా ఓ షాకింగ్ న్యూస్ చెప్పేసింది.

ఎక్కడ చూసినా అదే..
బిగ్ బాస్ షో నుంచి పునర్నవి బయటకు వచ్చాక ఆమె ఎక్కడకు వెళ్లినా రాహుల్‌కు సంబంధించిన ప్రశ్నలే ఎదురయ్యేది. బిగ్ బాస్ విన్నర్‌గా గెలిచిన రాహుల్‌కు కూడా మీడియా ఎదుట పునర్నవికి సంబంధించిన ప్రశ్నలే ఎదురయ్యేవి. ఇద్దరి మధ్య ఏముంది? పెళ్లి చేసుకోబోతోన్నారా? అని మీడియా సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిసేది.

మంచి స్నేహితులం..
రాహుల్ పునర్నవి ఏనాడూ తమ మధ్య ఉన్నది ప్రేమ అని ఒప్పుకోలేదు. తాము మంచి స్నేహితులమేనని చెప్పుకొచ్చారు. అయినా కొందరు వినేవారు. మళ్లీ మళ్లీ అవే ప్రశ్నలు సంధించేవారు. సోషల్ మీడియాలో లైవ్ సెషన్స్ చేసినప్పుడు, కామెంట్ల రూపంలో ప్రతీ సారి అవే ప్రశ్నలు సంధించేవారు. దీంతో ఇద్దరూ కూడా చిరాకు పడేవారు.

నెటిజన్లపై ఫైర్..
పెళ్లి గురించి రాహుల్ వద్ద పునర్నవి గురించి.. పునర్నవి వద్ద రాహుల్ గురించి నెటిజన్లు ప్రశ్నింస్తుండటంతో ఆ ఇద్దరూ కూడా అసహనం వ్యక్తం చేసేవారు. ఎవరి లైఫ్ వారికి ఉంటుంది.. అది బిగ్ బాస్.. ఇది రియల్ లైఫ్.. అది ముగిసిన కథ అంటూ రాహుల్ ఫైర్ అయ్యాడు. మరో వైపు పునర్నవి కూడా పెళ్లి విషయంపై ప్రశ్నలు అడిగిన నెటిజన్లపై తీవ్రస్థాయిలో మండిపడింది.
Recommended Video

ఎంగేజ్మెంట్ రింగ్..
తాజాగా పునర్నవి తన ఎంగేజ్మెంట్ అయిందన్నట్టుగా ఓ ఫోటోను షేర్ చేసింది. ఫైనల్లీ ఇట్స్ హ్యాపెనింగ్ అంటూ తన చేతిలో చేయి వేసినట్టున్న ఫోటోను షేర్ చేసింది. అవతల చేయి కూడా తెల్లగా ఉండటం, అది అమ్మాయి చేయి అని కొందరు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇది నిజమేనా? లేదా ఏదైనా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. పూర్తి వివారలు అక్టోబర్ 30న ప్రకటిస్తానని ఓ నెటిజన్‌కు పునర్నవి రిప్లై ఇచ్చింది.


Click it and Unblock the Notifications











