ఎంగేజ్మెంట్ అసలు కథ ఇది.. అక్కడే అన్నీ చెబుతుందట.. పునర్నవికి కాబోయే వరుడితడే
పునర్నవి నిన్నటి నుంచి వార్తల్లో వైరల్ అవుతోంది. ఫైనల్లీ ఇట్ హ్యాపెనింగ్ అంటూ నిశ్చితార్థం జరిగిపోయినట్టు ఓ ఫోటోను షేర్ చేసింది. అక్కడి వరకు బాగానే ఉంది. ఆ ఫోటోలో రెండు చేతులున్నాయి. అందులో ఒకటి పునర్నవి హ్యాండ్ అనుకుంటే రెండో చేతిపై ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆ హ్యాండ్ అంత తెల్లగా ఉంది కదా, అది అమ్మాయి హ్యాండ్‌లా ఉందంటూ పునర్నవి ప్రశ్నిస్తున్నారు.

పునర్నవి అలా..
పునర్నవి తాజాగా శ్రీముఖి వుమెనియా అనే షోలో పాల్గొంది, మామూలుగా ఈ షోను ఎప్పుడో షూట్ చేసినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఈ టాక్ షోలో జబర్దస్త్ అవినాష్ కూడా ఉన్నాడు. అంటే దాదాపు మూడు నెలల క్రితమే షూటింగ్ జరిగినట్టుంది. ఈ షోకు సంబంధించిన ప్రోమోను ఆల్రెడీ విడుదల చేశారు.

అక్టోబర్ 30న ఎపిసోడ్..
అయితే ఈ టాక్ షోకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్‌ను శుక్రవారం అంటే అక్టోబర్ 30న విడుదల చేస్తామని శ్రీముఖి తెలిపింది. అయితే ఇక్కడే అందరికీ తేడా కొట్టింది. పునర్నవి కొంత మంది నెటిజన్ల కామెంట్లకు ఆన్సర్ ఇచ్చింది. వాటిని దీన్ని పరిశీలిస్తే అసలు ఎంగేజ్మెంట్ కథను రేపు రివీల్ చేయబోతోందని తెలిసిపోతోంది.

అక్టోబర్ 30న వివరాలు..
ఇట్స్ ఫైనల్లీ హ్యాపెనింగ్ అంటూ పునర్నవి ఓ ఫోటోను షేర్ చేసింది. మిగతా విషయాలు కూడా చెప్పొచ్చు కదా అని కొందరు కామెంట్లు చేస్తుంటే ఆ సీక్రెట్స్ అన్నీ కూడా అక్టోబర్ 30న రివీల్ చేస్తానని తెలిపింది. వుమెనియా ఎపిసోడ్ కూడా 30నే విడుదల కానుంది. అంటే ఈ షోలో భాగంగా ఇదంతా నడిచిందని తెలుస్తోంది.

అక్కడే అన్నీ..
అయితే ఈ షోలో భాగంగానే పునర్నవి తనకు కాబోయే వరుడి వివరాలన్నీ ప్రకటించేందుకు రెడీ అయింది. అంతకు ముందుగానే ఓ ఫోటోను కూడా షేర్ చేసింది. కాబోయే భర్త ఫోటోను పునర్నవి షేర్ చేసింది. కానీ అంత క్లియర్‌గా చూపించలేదు. ఇక రేపు రాబోతోన్న శ్రీముకి వుమెనియా ప్రోగ్రాంలో అన్ని వివరాలు చెప్పినట్టు తెలుస్తోంది.

ఉద్భవ్ రఘనందన్..
పునర్నవి తనకు కాబోయే వాడి ఫోటోను షేర్ చేస్తూ.. నేను ఉద్భవ్ రఘనందన్‌కు యస్ చెప్పాల్సి వచ్చింది.. మిగిలిన విషయాలను రేపు ప్రకటిస్తాను అని పేర్కొంది. మరోవైపు ఉద్భవ్ పోస్ట్ చేస్తూ ఆమె యస్ చెప్పింది.. రేపు మిగతా వివరాలు చెబుతాను అప్పటి వరకు ఆగలేకపోతున్నా అంటూ పోస్ట్ చేశాడు. ఇతని ఫ్రొఫైల్‌లో యాక్టర్, డైరెక్టర్, రైటర్ అని ఉంది. అయితే ఇదేమీ మూవీ ప్రమోషన్స్ కోసం కాదు కదా అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











