అక్కడ పునర్నవి కొత్త టాటూ.. దాని అర్థం ఏంటో మరి?.. పిక్ వైరల్
బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేస్తుంటుందో అందరికీ తెలిసిందే. యోగాసనాలు, ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన విషయాలు, జాగ్రత్తలు చెబుతూ తన ఫాలోవర్లకు అవగాహన కల్పిస్తుంటుంది. అలా పునర్నవి సోషల్ మీడియాలో తన కంటూ ఓ గుర్తింపును సాధించుకుంది. అయితే పునర్నవి షేర్ చేసే ఫోటోలు అప్పుడప్పుడు వివాదాస్పదానికి దారి తీస్తుంటాయి.
జాతి రత్నాలు సక్సెస్ మీట్: నవీన్ పోలిశెట్టి హ్యాపీ (ఫొటోలు)

సోషల్ మీడియాలో అలా..
సోషల్ మీడియాలో నెటిజన్లకు పునర్నవి అంటే టెర్రర్. ఆమెపై వచ్చే ట్రోలింగ్‌లు ఎలా ఉంటాయో.. వాటికి ఆమె ఏ రీతిలో రియాక్ట్ అవుతుందో అందరికీ తెలిసిందే. ఎప్పుడూ కూడా ఓ సెక్షన్ నెటిజన్స్‌కు పునర్నవికి మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంటుంది.

తెరపై మాత్రం..
సోషల్ మీడియాలో పునర్నవికి ఎంత ఫాలోయింగ్ ఉన్నా కూడా తెరపై మాత్రం ఆఫర్లు అంతగా రావడం లేదు. బిగ్ బాస్ మూడో సీజన్ తరువాత పునర్నవికి ఆఫర్లు వెల్లువెత్తుతాయని అంతా భావించారు. కానీ ఒక్క సినిమా ఆఫర్ కూడా రాలేదు. ఈ మధ్య కమిట్మెంటల్ అనే ఓ వెబ్ సీరిస్‌లో పునర్నవి కనిపించింది.
హీరో కార్తికేయ లేటేస్ట్ ఫోటోషూట్ వైరల్.. చావు కబురు చల్లగా సక్సెస్‌పై కన్నేసిన యువ హీరో (ఫొటోలు)

తాజాగా ఇలా..
అయితే పునర్నవి తాజాగా అందరికీ ఓ షాక్ ఇచ్చింది. హాట్ లుక్కులో దర్శనమిచ్చింది. వీపు భాగం మొత్తం కనిపించేలా దుస్తులను ధరించింది. అయితే ఇందులో అందరి దృష్టి ఆమె మోచేతిపైనే పడింది. అక్కడ తన కొత్త టాటూ కనిపించడంతో అందరూ ఆరా తీయడం ప్రారంభించారు.

కొత్త టాటూపై చర్చలు..
మామూలుగా సెలెబ్రిటీలకు టాటూలపై మోజు ఎక్కువగా ఉంటుంది. కొందరైతే నాలుగైదు టాటూలు వేయించుకుంటారు. ఇంకొందరు ఒళ్లంతా పొడిపించుకుంటారు. అలా తాజాగా పునర్నవి తన మోచేతిపై టాటూను వేయించుకుంది. అయితే అది పద్మం గుర్తులా కనిపిస్తోంది. కానీ దాని అర్థం ఏంటి? అసలు అది ఏంటి? అనే విషయాలను మాత్రం పునర్నవి బయటకు చెప్పలేదు.


Click it and Unblock the Notifications











