Don't Miss!
- Finance Blood Bath: వారాంతంలో కుప్పకూలిన మార్కెట్లు.. బేర్స్ చేతిలో Sensex-Nifty..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆ హీరోయిన్లా ఉంటావ్ అంటూ పొగిడేసిన నెటిజన్.. పునర్నవి రియాక్షన్ హైలెట్!
ఉయ్యాలా జంపాల, పిట్టగోడ వంటి చిత్రాలతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాలోనూ నటిగా పేరును సంపాదించుకుంది. కానీ బిగ్ బాస్ షోలోకి వచ్చాకే పునర్నవికి ఇమేజ్ పెరిగింది. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగింది. బిగ్ బాస్ తరువాత సోషల్ మీడియాలో పునర్నవి రేంజ్ మారిపోయింది. అయితే పునర్నవి ఎప్పుడూ కూడా వివాదాల చుట్టే తిరుగుతూ ఉంటుంది.
సోషల్ మీడియాలో అలా..
బిగ్ బాస్ షో తరువాత పెరిగిన ఇమేజ్ను సోషల్ మీడియా ద్వారా పునర్నవి కాపాడుకుంటూ ఉంటోంది. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. అయితే తన అందాల ఆరబోతపై వచ్చే వార్తలపై మాత్రం ఫైర్ అవుతూ ఉంటుంది.
ఆ మధ్య వివాదం..
పునర్నవి మామూలుగా యోగా, వ్యాయామం అంటూ ఫుల్ బిజీగా ఉంటుంది. అయితే ఓ సారి యోగా చేస్తూ హాట్ అందాలను బయటపెట్టేసింది. అలా ఎద అందాలు వైరల్ కాగా.. వాటిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. వాటిపై పునర్నవి ఓ రేంజ్లో ఫైర్ అయింది. అలా ఆ వివాదం ఓ స్థాయికి వెళ్లింది.
వెబ్ సిరీస్‌తో బిజీగా..
అయితే బిగ్ బాస్ తరువాత పునర్నవికి సినిమా అవకాశాలేమీ అంతగా రాలేదు. క్రేజ్ వచ్చినంతగా ఆఫర్లు మాత్రం రాలేదు. లాక్డౌన్ కాలంలో పునర్నవి ఓ వెబ్ సిరీస్‌తో సందడి చేసింది. కమిట్‌మెంటల్ అనే తన వెబ్ సిరీస్ కోసం డిఫరెంట్ ప్రమోషన్స్ చేసింది. తన పెళ్లి అన్నట్టుగా కలరింగ్ ఇచ్చి అందరినీ బోల్తా కొట్టేసింది.
తాజాగా అలా..
పునర్నవికి సముద్ర తీరాను సేద తీరడం ఇష్టం. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చా కూడా ఇలానే గోవాకు చెక్కేసింది. డీ విటమిన్ కోసం ఎండలో ఉంటూ ఆరోగ్య సూక్తులు కూడా చెబుతూ ఉంటోంది. అయితే తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
నిత్య మీనన్‌లా..
అయితే ఆ ఫోటోలను చూసిన ఓ నెటిజన్.. నిత్య మీనన్‌లా ఉన్నావంటూ పొగిడేశాడు. దానికి ప్రతిగా పునర్నవి స్పందించింది. థాంక్యూ అంటూ.. అవును నాకు ఆమె రోల్ మోడల్ అంటూ నిత్య మీనన్ మీదున్న అభిమానాన్ని చాటింది. ఈ ఇద్దరూ కలిసి మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమా కోసం కలిసి పని చేసిన సంగతి తెలిసిందే.