twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జాగ్రత్త! చెంపలు వాయించే సమయం వచ్చింది.. ఆ ఇద్దరి మాట వినండి.. పూరీ జగన్నాథ్

    |

    దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు సామాజిక బాధ్యత ఎక్కువే అనే విషయం సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా పలు సందర్భాల్లో స్పష్టమైంది. సమాజానికి ఏదైనా విపత్తు, ముప్పు వాటిల్లిందంటే తక్షణమే స్పందిస్తారు. తనకు తోచిన విధంగా సహాయం అందించేందుకు ప్రయత్నిస్తారు. ఇతరులకు స్పూర్తిని కలిగించేందుకు బాధ్యతగా వ్యవహరిస్తారు. తాజాగా కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ప్రజలకు పూరీ ఏం చెప్పారంటే..

    Recommended Video

    Puri Jagannath Motivational Speech | ప్రతి భారతీయుడు చూడాల్సిన వీడియో!!
    పర్యావరణంపై పట్టింపు లేదే

    పర్యావరణంపై పట్టింపు లేదే

    క్లైమెట్ ఛేంజ్, గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ గ్యాసెస్ లాంటి విషయాలను చెబితే మనం వాటిని జోకులుగా పరిగణిస్తాం. పక్కవాడు ఎవడైనా ఇలాంటి టాపిక్స్ తీస్తే నీకు ఎందుకురా అనే విధంగా ఫోజు కొడుతుంటాం. ఆస్ట్రేలియాలో అడవులు రెండు నెలలు తగలపడుతున్నా, 30 శాతం స్వచ్ఛమైన వాయువును ఇచ్చే అమెజాన్ అడవులు తగలబడి పోతున్నా పట్టించుకోం అని పూరీ జగన్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.

    చెంపలు వాయించే..

    చెంపలు వాయించే..

    ఇప్పుడు కరోనావైరస్ వ్యాప్తి చెంది అందరి చెంపలు లాగి కొట్టబోతున్నది. ఇప్పుడు మనకు అన్నీ అర్ధం అవుతాయి. పర్యావరణ వ్యతిరేకం పరిస్థితులు గురించి ఇక అర్ధం అవుతాయి. వైరస్‌లన్నీ అడవుల్లోకాకుండా పట్టణాల్లోనే పుడుతాయి. సిటీలలో ఎక్కువగా పాపులేషన్ ఉంటుంది కాబట్టే వైరస్‌లు అక్కడే పుడుతాయి. అడవుల్లో ఎందుకు పుట్టవంటే.. జంతువులన్నీ ప్రకృతికి అనుకూలంగా బతుకుతాయి. మానవులే ప్రకృతికి వ్యతిరేకంగా బతుకుతారు. అందుకే వైరస్‌లన్నీ సిటీలలోనే పుడుతాయి అని పూరీ జగన్నాథ్ పేర్కొన్నారు.

    ప్రాణాంతక వ్యాధులతో

    ప్రాణాంతక వ్యాధులతో

    గతంలో స్పానిష్ ఫ్లూ రావడంతో 500 మిలియన్ల మంది మరణించారు. ఇండియాలో ప్లేగు రావడంతో 15 లక్షల మంది చనిపోయారు. నా చిన్నతనంలో కలరా వ్యాధి రావడంతో 50 మిలియన్ల ప్రజలు చనిపోయారు. అప్పుడు మీడియా ఇంత బలంగా లేదు కాబట్టి పెద్దగా తెలియలేదు. కలరా, ఇతర వ్యాధులతో ప్రతీ ఏడాది చాలా మంది చనిపోతుంటారు అని పూరీ జగన్నాథ్ వెల్లడించారు.

    కరోనాను కంట్రోల్ చేయకపోతే

    కరోనాను కంట్రోల్ చేయకపోతే

    గత వ్యాధులతో పోల్చితే.. కరోనా వల్ల చాలా తక్కువ మంది చనిపోయారు. ఇప్పుడు కనుక కరోనాను కంట్రోల్ చేయకపోతే గతంలో కంటే రెండు మూడింతలు ఎక్కువగా చనిపోయే ప్రమాదం ఉంది. కరోనాను కంట్రోల్ చేయాలంటే కనీసం రెండువారాలు లాక్‌డౌన్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఎక్కువ ప్రాణనష్టం కలిగే అవకాశం ఉంది అని పూరీ జగన్నాథ్ అన్నారు.

    లాక్‌డౌన్ తప్పనిసరి

    లాక్‌డౌన్ తప్పనిసరి

    ప్రపంచదేశాల్లో లాక్‌డౌన్ కొనసాగతున్నది. అమెరికాలో రెండువారాలు, స్పెయిన్, ఇటలీలో రెండు వారాలు, చైనాలో నెలరోజులుగా లాక్‌డౌన్ కొనసాగడం వల్లే ఇప్పుడు కరోనాను నియత్రించడంలో సఫలత సాధించారు. మన వద్ద లాక్ డౌన్ అంటే ఎవరికీ పట్టడంలేదు.. అర్ధం కావడం లేదు అని పూరీ జగన్నాథ్ తెలిపారు.

    చప్పట్లు కొట్టమంటే.. వీధుల్లోకి ఎందుకు

    బాల్కనీలోకి వచ్చి చప్పట్లు కొట్టాలని ప్రధాని మోదీ చెబితే.. అందరూ వీధుల్లోకి వచ్చి ర్యాలీలు తీస్తున్నారు. అలా చేయకూడదు. ఇప్పటికే ఫ్లయిట్లు, రైళ్లు ఆపివేశారు. కాబట్టి లాక్ డౌన్‌ను పాటించాలి. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో మనం వినాల్సింది ఇద్దరి మాటే. ఇకరు పోలీసు, రెండోది డాక్టర్లు, వైద్య సిబ్బంది అని పూరీ జగన్నాథ్ సూచించారు.

    లాక్‌డౌన్ కష్టమైతే.. ఇలా చేయండి..

    లాక్‌డౌన్ కష్టమైతే.. ఇలా చేయండి..

    ఇక లాక్ డౌన్ అంటే అందరికి కష్టంగానే ఉంటుంది. చాలా మందికి నచ్చకపోయినా తప్పదు. ఈ పరిస్థితులతో పుస్తకాలు చదవండి. సినిమాలు చూడండి.. పెంపుడు జంతువులతో ఆడుకోండి. ఇంట్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని దేశానికి సేవ చేసే అవకాశం వచ్చింది. కాబట్టి మీరు దేశ సేవలో భాగం కావాలి అని పూరీ జగన్నాథ్ కోరారు.

    English summary
    Director Puri Jagannadh released a viedo about Coronavirus precautions and Lockdown. He adviced to follow the government, Doctor, Police suggestions and advices.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X