పూరీ జగన్నాథ్.. విజయ్ దేవరకొండ నోరు మూయిస్తాడట.. షాక్‌లో క్రేజీ స్టార్ ఫ్యాన్స్
'ఇస్మార్ట్ శంకర్' విజయంతో మంచి ఊపుమీదున్నాడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఈ క్రమంలోనే తన తర్వాతి చిత్రాన్ని కూడా ప్రకటించేయాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇది దాదాపుగా నిజమేనన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ షాక్‌కు గురవుతున్నారు.

‘డబుల్ ఇస్మార్ట్' ఆపేసి..
‘ఇస్మార్ట్ శంకర్' సక్సెస్ మీట్ సమయంలో పూరీ జగన్నాథ్ ఆ సినిమా సీక్వెల్ చేస్తున్నానని ప్రకటించాడు. అంతేకాదు, త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన కార్యక్రమంతో కలుద్ధాం అన్నాడు. అయితే, ఈ సినిమా చేయడానికి రామ్ సిద్ధంగా లేడన్న టాక్ వినిపించింది. దీంతో ఆ కథను పక్కన పెట్టేసి, విజయ్ దేవరకొండతో సినిమా చేయడానికి సిద్ధం అయినట్లు టాక్.

పూరీ, విజయ్.. మాస్ మసాలా కథ
విజయ్ దేవరకొండతో చేయబోయే సినిమా కోసం పూరీ జగన్నాథ్ పక్కా మాస్ మసాలా కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది. తన గత చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్' హిట్ తర్వాత ఇకపై మాస్ సినిమాలే చేస్తానని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే మరో మాస్ స్టోరీని సిద్ధం చేసేసినట్లు ప్రచారం జరుగుతోంది.

మాటలు రాని వ్యక్తిగా..
విజయ్ దేవరకొండ తనదైన శైలిలో చెప్పే డైలాగులకు చాలా మంది అభిమానులే ఉన్నారు. అయితే, ఈ సినిమాలో మాత్రం అతడి కోసం ఓ ప్రత్యేకమైన పాత్రను రాసినట్లు సమాచారం. ఇందులో విజయ్ మాటలు సరిగా పలకలేని వ్యక్తిగా కనిపించబోతున్నాడని తెలిసింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ అందరూ షాక్‌కు గురవుతున్నారు.

గతంలో పలువురు హీరోలు కూడా..
పాత తరం హీరోలు ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు ఎన్నో చేసినప్పటికీ.. తర్వాతి తరం వాళ్లు మాత్రం ఇవి చేయడానికి అంత ఆసక్తి చూపలేదు. అయితే, ఇటీవల ‘రాజా ది గ్రేట్'లో రవితేజ కళ్లు లేని వ్యక్తిగా, ‘జై లవ కుశ'లో ఎన్టీఆర్ నత్తి ఉన్న పాత్రలో, ‘రంగస్థలం'లో రామ్ చరణ్ చెవులు వినపడని మనిషిగా కనిపించారు. ఇదే ప్రేరణతో విజయ్ కూడా ఈ పాత్ర విషయంలో నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు.

మైత్రీ - పూరీ భాగస్వామ్యంలో..
ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించాల్సి ఉన్నా.. పూరీ తన భాగస్వామ్యం కూడా ఉండాలన్న కండీషన్ పెట్టినట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ రెండు సంస్థలు కలిసి ఈ సినిమాను నిర్మించబోతున్నాయని ఫిలింనగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ వ్యవహారాలను ఛార్మీ దగ్గరుండి చూసుకుంటుందని టాక్.


Click it and Unblock the Notifications











