కావాల్సినవన్నీ కూడా లోపలే ఉన్నాయ్.. నగ్నంగా పోజు.. కవ్విస్తోన్న రాయ్ లక్ష్మీ
వెండితెరపై అవకాశాలు లేకపోయినా, జనాల్లో ఎక్కువగా కనిపించకపోయినా కొంత మంది తారలకు మాత్రం స్టార్డం తగ్గదు. అలాంటి వారిలో రాయ్ లక్ష్మీ ముందుంటుంది. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి ఆఫర్లు లేకపోయినా తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. దీనికి కారణం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం. సోషల్ మీడియాలో రాయ్ లక్ష్మీ చేసే హడావిడి అంతా కాదు.

అలా అవకాశాలు..
హీరోయిన్‌గా లక్ష్మీ రాయ్‌కి తెలుగులో మంచి అవకాశాలే వచ్చాయి. కానీ సరైన హిట్ మాత్రం తన ఖాతాలో వేసుకోలేకపోయింది. చివరకు తన పేరును కూడా మార్చేసుకుంది. రాయ్ లక్ష్మీ అంటూ పేరు మార్చుకున్నా కూడా లక్ కలిసి రాలేదు. ఇక చివరకు హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిపోవడంతో స్పెషల్ సాంగ్స్‌లోనూ నటించేసింది.

రత్తాలుగా ఫేమస్..
సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో ఓ చిన్న రోల్ పోషించి.. స్పెషల్ సాంగ్‌లో దర్శనమిచ్చాక మంచి ఆఫర్లే వచ్చాయి. అయితే అలా ఖైదీ నంబర్ 150 సినిమాలో చేసిన రత్తాలు పాటతో తెలుగులో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినట్టు అయింది. ఆ పాటలో రాయ్ లక్ష్మీ కాస్తా రత్తాలుగా మారింది.

బిగ్ బాస్ షోలో అలా..
బిగ్ బాస్ నాల్గో సీజన్ ఫినాలేఎపిసోడ్ నాడు రాయ్ లక్ష్మీ చేసిన హాట్ పర్ఫామెన్స్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లిన రాయ్ లక్ష్మీ ఓ కంటెస్టెంట్‌ను బయటకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అలా మరోసారి సోషల్ మీడియాలో రాయ్ లక్ష్మీ వైరల్అయింది. తాజాగా మరోసారి రాయ్ లక్ష్మీ కాకరేపింది.

అన్నీ లోపలే ఉన్నాయి..
నగ్నంగా ఉన్న ఫోటోను షేర్ చేసిన రాయ్ లక్ష్మీ అందరిలోనూ వేడి పుట్టించేసింది. దుప్పటి కప్పుకుని కాఫీ కప్పుతో కవ్వించేసింది. దీంతో పాటు ఆమె చేసిన కామెంట్ మరింతగా హాట్ టాపిక్ అవుతోంది. నువ్ కోరుకునే ప్రతీ ఒక్కటి నీ లోపలే ఉంది అంటూ కౌంటర్ వేసింది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











