వాటిని మళ్లీ మళ్లీ అనుభవించాలని ఉందట.. రాశీ ఖన్నా అందాల ఆరబోత
అందాల తార రాశీ ఖన్నా ఈ మధ్య సోషల్ మీడియాను ఓ రేంజ్‌లో ఊపేస్తోంది. అందాల ఆరబోతకు ఆమడ దూరంలో ఉండే రాశీ ఖన్నా ఇప్పుడు మాత్రం తెగ హల్చల్ చేస్తోంది. ఏకంగా బికినీలో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఒకప్పుడు బొద్దుగా ఉండే రాశీ ఖన్నా.. జీరో సైజ్‌లోకి మారి అందాలను ప్రదర్శించేసింది. అయితే ఇలా బికినీ ఆకారంలోకి వచ్చేందుకు తాను ఎంతగా కష్టపడిందో కూడా వివరించింది.

తెరపై అలా..
ఊహలు ఊహలు గుసగుసలాడే సినిమా నుంచి కూడా రాశీ ఖన్నా ఎప్పుడూ కూడా అందాల ప్రదర్శనకు ప్రాధాన్యమివ్వలేదు. రొమాంటిక్ సీన్స్‌కు కూడా ఓకే చెప్పలేదు. కానీ ఈ మధ్య మాత్రం రాశీ ఖన్నా తన హద్దులన్నింటిని చెరిపివేసినట్టు కనిపిస్తోంది.

రొమాంటిక్ పాత్రలు..
ఇక రాశీ ఖన్నా రొమాంటిక్ పాత్రలు చేసేందుకు రెడీ అయింది. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో పోషించిన పాత్రకు నెగిటివ్ కామెంట్లు వచ్చినా కూడా రాశీ ఖన్నా ముందుకు వెళ్లేందుకే ఫిక్స్ అయినట్టుంది. అందుకే ఇలా సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ తాను ఎలాంటి పాత్రకైనా రెడీ అన్నట్టు సిగ్నల్ ఇస్తోన్నట్టు కనిపిస్తోంది.

ఏడాదికిపైగా..
ఆ మధ్య గోవాలో రాశీ ఖన్నా ఎంజాయ్ చేస్తూ.. సడెన్‌గా బికినీలో దర్శనమిచ్చింది. అయితే తాను ఇంతలా తన ఆకృతిని మార్చుకోవడం వెనుక ఏడాది శ్రమ దాగి ఉందని చెప్పుకొచ్చింది. అయితే సరైన డైట్ పాటించి.. వ్యాయామం సరిగ్గా చేయడంతోనే ఇలా సాధ్యమైందని రాశీ ఖన్నా తెలిపింది.

ఫుల్ బిజీగా..
అయితే రాశీ ఖన్నా ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. హైద్రాబాద్,గోవా, కోచ్చి, చెన్నై అంటూ క్షణం తీరిక లేకుండా తిరిగేస్తోంది. బాలీవుడ్, కోలీవుడ్ ప్రాజెక్ట్‌లతో రాశీ ఖన్నా ఫుల్ బిజీగా గడిపేస్తోంది. రాత్రి పూట షూటింగ్‌లతో రాశీ ఖన్నా బాగానే అలసిపోతోన్నట్టు కనిపిస్తోంది.

మళ్లీ మళ్లీ..
అయితే తాజాగా రాశీ ఖన్నా అదిరిపోయే హాట్ లుక్‌లో కనిపించింది. దాంతో పాటు ఏదో ఊహల్లో తేలిపోతోన్నట్టు ఓ కొటేషన్ చెప్పింది. కొన్ని కొన్ని సార్లు గతంలోకి వెళ్లాలనే కోరిక పుడుతుంది.. అయితే ఏదో మార్చేయడానికి మాత్రం కాదు.. కొన్నింటిని మళ్లీ మళ్లీ అనుభవించేందుకు.. అచ్చం ఈ రోజు మాదిరిగా అంటూ చెప్పుకొచ్చింది. కానీ ఆ సంగతులేంటో మాత్రం బయటకు చెప్పలేదు.


Click it and Unblock the Notifications











