For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  స్కూల్‌లోనే మొదటి ఎఫైర్.. హార్ట్ బ్రేక్.. ఐఏఎస్ కావాలనుకున్న రాశిఖన్నా చివరకు అలా..

  |

  జీవితం అనేది ఒక మాయా ప్రపంచం. మనం అనుకున్నట్లు ఎప్పుడు ఒకేలా ఉండదు. డబ్బు ఎంత సంపాదించినా.. హోదా ఎంత పెరిగినా కూడా లైఫ్ ఏ క్షణాన ఎలా మారుతుందో ఎవరికి తెలియదు. అయితే జీవితమంటే ఒక అందమైన జ్ఞాపకాల నిధి అంటోంది క్యూట్ బ్యూటీ రాశి ఖన్నా. నేడు ఈ ఛబ్బి గర్ల్ పుట్టినరోజు. 29వ వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంగా సెలబ్రెటీలు అభిమానులు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో విషెస్ అందిస్తున్నారు.

  జీవితం ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుంది

  జీవితం ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుంది

  రాశి ఖన్నా సినిమా హీరోయిన్ గా కొనసాగుతుందని ఆమె సన్నిహితులు ఎవరు కూడా ఊహించలేదట. ఇక రాశి కూడా ఆ విధంగా ఆలోచించింది లేదట. కానీ ఆమె చదువులో మాత్రం నెంబర్ వన్. మొదట సింగర్ కావాలని అనుకుంది. కానీ ఆ తరువాత పుస్తకాలకు బాగా దగ్గరవ్వడంతో ఐఎస్ కావాలని ఒక టార్గెట్ కూడా సెట్ చేసుకుందట. కానీ అనుకోని కారణాల వల్ల ఆమె జీవితం ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుంది.

  గుండెల్లో ప్రేమ బాణాన్ని దింపేసింది

  గుండెల్లో ప్రేమ బాణాన్ని దింపేసింది

  రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా ఊహలు గుసగుసలాడే. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాతో అమ్మడు ఓ వర్గం కుర్రాళ్ల గుండెల్లో ప్రేమ బాణాన్ని దింపేసింది. నిజానికి మద్రాస్ కేఫ్ అనే బాలీవుడ్ సినిమాలో ఒక చిన్న పాత్ర ద్వారా అమ్మడు వెండితెరకు పరిచయమైంది. ఆ తరువాత మనం సినిమాలో నాగచైతన్య లవర్ గా చిన్న గెస్ట్ రోల్ లో నటించింది. ఆ తరువాతి ఊహలు గుసగుసలాడే సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను అందుకుంది.

  ఐఎఎస్ కావాలని.. కష్టపడినప్పటికి..

  ఐఎఎస్ కావాలని.. కష్టపడినప్పటికి..

  రాశి పుట్టి పెరిగింది మొత్తం ఢిల్లీలోని. విద్యాభ్యాసం కూడా అక్కడే పూర్తి చేసిన ఈ బ్యూటీ సింగర్ కావాలని మొదట్లో ప్రయత్నాలు గట్టిగానే చేసిందట. ఇక ఆ తరువాత ఐఎఎస్ కావాలనే లక్ష్యంతో పుస్తలతో కాలాన్ని గడిపింది. అనంతరం ప్రకటనల రచయితగా మరికొన్ని రోజులు గడిపినట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది రాశి ఖన్నా. రాశి కొన్ని సినిమాల్లో పాటలు పాడిన విషయం తెలిసిందే.

  చిన్న వయసులోనే ప్రేమ

  చిన్న వయసులోనే ప్రేమ

  ఇక దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలో తొలి ప్రేమ గాయం ఉంటుందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అలాగే రాశి ఖన్నా స్కూల్ లోనే మొదటి ప్రేమ మాధుర్యాన్ని చూసిందట. 17ఏళ్ల వయసులో తన సీనియర్ ప్రపోజ్ చేశాడని చెప్పిన రాశి కొన్నాళ్లకు బ్రేకప్ అయినట్లు చెప్పింది. ఆ వయసులో ప్రేమ అంటేనే తెలియదని అనుకోకుండా కొన్ని సంఘటనలు తరువాత విడిపోయామని, ప్రస్తుతానికైతే తను ఎవరితో ప్రేమలో లేనని చెబుతోంది.

  వరుసగా నాలుగు సినిమాలు

  వరుసగా నాలుగు సినిమాలు

  గత ఏడాది ప్రతి రోజు పండగే సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీకి ఈ ఏడాది విజయ్ దేవరకొండతో చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ ఊహించని ఫలితాన్ని ఇచ్చింది. ఇక ఇప్పుడు ఆమె చేతిలో మంచి సినిమాలే ఉన్నాయి. వరుసగా తమిళ్ లో నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక విజయ్ సేతుపతితో చేస్తున్న ఒక సినిమాలో రాశి పాత్ర ఆమె కెరీర్ కి బూస్ట్ ఇచ్చే విదంగా ఉంటుందట. అలాగే తెలుగులో మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు టాక్.

  English summary
  Fans of talented young actress Raashi Khanna were in for a huge shock when her previous film, World Famous Lover, released in February. In the film, Raashi was seen performing a series of bold, intimate scenes with Vijay Deverakonda, which of course did not go down well with her fans who raised severe objections.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X