పబ్లిక్‌లో మందు, సోడా, స్టఫ్.. అబ్బో రాధికా ఆప్టే రచ్చ మామూలుగా లేదు
వివాదాలను వెంటేసుకుని తిరిగే భామల్లో రాధికా ఆప్టే ముందుంటుంది. ఏదైనా సరే బోల్డ్‌గా చేయడమే ఈ హాట్ హీరోయిన్‌కు అలవాటు. తమిళ,తెలుగు, హిందీ భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. నటిగా అద్భుతమైన నటనను కనబర్చడమే కాకుండా.. అందంలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకుంది. తెలుగులో 'రక్త చరిత్ర', బాలయ్యతో 'లెజెండ్', 'లయన్', ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో వచ్చిన ధోని చిత్రంలో నటించి మెప్పించింది. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఓ ఫోటోపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

సోషల్ మీడియాలో రచ్చ..
తెరపై ఎంత బోల్డ్‌గా ఉంటుందో.. సోషల్ మీడియాలో అంతకు మించి హాట్‌గా ఉంటుంది. బికినీలు, బీచ్‌లు అంటూ రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది. సినిమాల కంటే సోషల్ మీడియాలోనే రాధిక ఎక్కువగా పాపులర్ అవుతూ ఉంటుంది. ఆమె తన పర్సనల్ విషయాలను చెబుతూ డేటింగ్, పెళ్లి అంటూ సెన్సేషన్ క్రియేట్ చేసింది.

తాజాగా అనురాగ్ కశ్యప్‌పై..
ఈ మధ్య అనురాగ్ కశ్యప్‌పై పాయల్ ఘోష్.. సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాధికా ఆప్టే స్పందిస్తూ.. నువ్ నాకు అత్యంత సన్నిహితుడివి.. నువ్ నన్ను ఎంతో ప్రోత్సహించే వాడివి. ప్రతీ విషయంలో నా వెన్నంటే ఉండేవాడివి.. నువ్ నన్ను ఎప్పుడూ నీతో పాటే సరిసమానం చూసేవాడివి.. ఇద్దరి మధ్య గౌరవం, ప్రేమ సరిపాళ్లలో ఉండేవి. నువ్ ఏంటో నాకు తెలుసు నీతో ఉంటే ఎంతో భద్రంగా ఉన్నట్టు ఫీలయ్యే దాన్ని అనురాగ్ కశ్యప్ గురించి తెలిపింది.

మందు సోడా..
పబ్లిక్‌గా పిక్‌నిక్ వచ్చానని చెబుతూ.. అక్కడ వెదర్‌కు తగ్గట్టు అదిరిపోయేలా పెగ్గు కలిపినట్టు రాధిక పేర్కొంది. ఇక మందులో సోడా ఎంత కలిపింది.. స్టఫ్ ఏం తింటుందో కూడా వివరించింది. 50 ఎం ఎల్ విస్కీలో 120 ఎం ఎల్ సోడా కలిపానని, దోసకాయ ముక్కల్ని స్టఫ్‌గా కట్ చేసి పెట్టుకున్నానని రాధిక తెలిపింది. ఈ మేరకు షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.
Recommended Video

నెటిజన్స్ ఫైర్..
అలా పబ్లిక్‌గా తాగుతున్నావ్.. నువ్ ఏ విషయాన్ని ప్రోత్సహించాలని అనుకుంటున్నావ్? అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. అయినా ఇలాంటి కామెంట్లను, ట్రోలింగ్‌ను పట్టించుకునే టైపు కాదు రాధిక. ఎవరు ఎన్ని అన్నా తాను చేయాలనుకున్నదే చేస్తుంది.


Click it and Unblock the Notifications











