ఆ సమయంలో గొడవపడ్డాం, మా మధ్య మాట్లల్లేవు... అవన్నీ ఇప్పుడు అవసరమా.. రాధిక నోర్మూయించిన చిరు

Recommended Video

Chiranjeevi And Radhika Funny Video Viral In Social Media || Filmibeat Telugu

మెగాస్టార్ చిరంజీవి, రాధిక జంటగా కలిసి నటించిన సినిమాలు ఘనవిజయాలు సాధించాయనే విషయం కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇటీవల జరిగిన ఓ ఫంక్షన్‌కు హాజరైన చిరంజీవి, రాధికను కలిపి యాంకర్ సుమ మాట్లాడమని కోరగా ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఈ సందర్భంగా అక్కడే ఉన్న దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి కూడా జత కలవడంతో వారి మధ్య మాటలు మరింత ఆసక్తిగా మారాయి. ప్రస్తుతం పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నది. సందర్భంగా ఆ ముగ్గురు ఏం చెప్పారంటే...

చిరంజీవిని చూస్తే నాకు

చిరంజీవిని చూస్తే నాకు

చిరంజీవిని చూస్తే మీకు ఏ పాట గుర్తుకు వస్తుంది అని నటి రాధికను యాంకర్ సుమ అడిగితే.. అభిలాష చిత్రంలో నాకు బంతి చామంతి అనే పాట గుర్తుకు వస్తుంది అనగానే పక్కనే నేను ఉన్నానంటూ వారికి కోదండరామిరెడ్డి వారితో జత కలిశారు. దాంతో అపురూపమైన కాంబినేషన్ అంటూ సుమ తన మాటలకు పదునుపెట్టారు.

 చిరంజీవితో 25 సార్లు కలిసి

చిరంజీవితో 25 సార్లు కలిసి

చిరంజీవితో మీ వర్కింగ్ ఎక్స్పీరియెన్స్, గొప్పగా గుర్తున్న విషయం చెప్పమని రాధికను సుమ అడుగగా.. చిరంజీవి నాకు ఫేవరేట్ హీరో, ఆయన నేను కలిసి 25 చిత్రాల్లో నటించాం. హీరో, హీరోయిన్లుగా 15 సినిమాలు చేశాం అని రాధిక చెప్పారు.

ఆ సమయంలో మా మధ్య ఫైట్ జరిగింది

ఆ సమయంలో మా మధ్య ఫైట్ జరిగింది

అభిలాష చిత్రంలోని నవ్వింది మల్లే చెండు అనే పాట షూట్ జరిగినప్పుడు మేమిద్దరం కోట్లాడుకొన్నాం. ఆ సమయంలో మాటల్లేవు. అందుకు ఓ సిల్లీ కారణం అంటూ రాధిక చెప్పుతుండగా అవన్నీ తెలుగు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందా? అని రాధికకు మాటలకు బ్రేక్ వేశారు.

రాధికకు చిరంజీవి చురక

రాధికకు చిరంజీవి చురక

మనమిద్దరం ఎందుకు పోట్టాడుకొన్నామో తెలుగు, తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అంటూ రాధిక చురక అంటించారు. చిరంజీవి గారు అంటే నాకు చాలా గౌరవం. నన్ను చాలా బాగా ప్రోత్సాహించారు. నన్ను తెలుగు ప్రజలు బాగా ఆదరించారు. నటిగా నాకు గొప్ప గౌరవం ఇచ్చారు అని రాధిక చెప్పారు.

 యూత్‌కు పిచ్చిగా నచ్చిందని

యూత్‌కు పిచ్చిగా నచ్చిందని

చిరంజీవి, రాధికను చూస్తే నాకు బంతి చామంతితోపాటు నవ్వింది మల్లే చెండు పాట బాగా గుర్తొస్తుంది. ఆ సమయంలో యూత్‌కు పిచ్చిగా నచ్చింది. థియేటర్లో ఆడియెన్స్ ఆ పాటకు లేచి డ్యాన్పులు చేశారు. అందుకే నాకు ఆ పాట అంటే చాలా ఇష్టం అని కోదండరామిరెడ్డి తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X