Don't Miss!
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చిరంజీవి కోసం లారెన్స్ ప్రత్యేక పూజలు.. అభిమానం అంటే అదే!!
డ్యాన్సర్‌గా ఎక్కడో గ్రూపులో ఓ చోట స్టెప్పులేసుకునే లారెన్స్ ప్రతిభను కనిపెట్టి గుర్తించి కొరియోగ్రఫర్‌గా అవకాశమిచ్చాడు చిరంజీవి. ముఠామేస్త్రీలోని టైటిల్ సాంగ్‌లో లారెన్స్ ఎక్కడో మూలన డ్యాన్స్ చేస్తుంటాడు.. ఆ సమయంలో చిరు కన్ను లారెన్స్‌పై పడింది. ఆ తరువాత హిట్లర్ సినిమాతో లారెన్స్ దశ తిరిగింది. అప్పటి నుంచి చిరంజీవి కోసం స్పెషల్ స్టెప్పులను కంపోజ్ చేయడం ప్రారంభించాడు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు నిర్మాత, దర్శకుడిగా ఈ స్థాయికి వచ్చాడు.
అలాంటి లారెన్స్ చిరంజీవి కోసం ప్రత్యేక పూజలు చేశాడు. చిరంజీవి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆచార్య సినిమా షూటింగ్ మొదలుకాబోతోన్న సందర్భంగా కరోనా పరీక్షలు నిర్వహించుకుంటే అందుకే పాజిటివ్ వచ్చిందని సోషల్ మీడియాలో చిరు తెలిపాడు. 'ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని,కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్.
నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు.వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను.గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను.ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను' అంటూ ట్వీట్ చేశాడు.
ఈ విషయం తెలిశాక అభిమానులందరూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిరు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. తాజాగా లారెన్స్ కూడా తన ఇష్టదైవం రాఘవేంద్రస్వామిని ప్రార్థించాడు. చిరంజీవి అన్నయ్య త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నాను అంటూ లారెన్స్ ఓ ఫోటోను షేర్ చేశాడు. అభిమానం అంటే నీదే అన్న మెగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.