For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Ashu Reddy కి అక్కడ ముద్దు పెట్టిన రాహుల్: ఆమెతో కలిసి సర్‌ప్రైజ్ అనౌన్స్‌మెంట్ అంటూ షాకింగ్ పోస్ట్

  |

  బిగ్ బాస్ షో ద్వారా ఎంతో మంది చాలా తక్కువ సమయంలోనే ఊహించిన ఎత్తుకు ఎదిగిపోతున్నారు. అంతకు ముందే సెలెబ్రిటీలు అయిన వాళ్లైతే మరింత ఫేమస్ అవుతున్నారు. అలాంటి వారిలో ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లీగంజ్ ఒకడు. ప్లేబ్యాక్ సింగర్‌గా కెరీర్‌ను ఆరంభించిన అతడు.. బిగ్ బాస్ మూడో సీజన్‌లో విజేతగా నిలిచాడు. అప్పటి నుంచి రచ్చ రచ్చ చేస్తున్నాడు. ఇక, అషు రెడ్డితో రిలేషన్‌లో ఉన్నానని చెప్తూ తరచూ పోస్టులు పెడుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఆమెకు ముద్దు పెడుతూ సర్‌ప్రైజ్ అనౌన్స్‌మెంట్ అంటూ పోస్ట్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

  పొట్టి నిక్కరులో కనువిందు చేస్తోన్న పార్వతి నాయర్

  అలా మొదలైన కెరీర్.. వాటితో క్రేజ్

  అలా మొదలైన కెరీర్.. వాటితో క్రేజ్

  ‘జోష్'లోని ‘కాలేజ్ బుల్లోడా' అనే పాటతో రాహుల్ సిప్లీగంజ్ సింగర్‌గా తన సినీ కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత ‘దమ్ము', ‘ఈగ', ‘రచ్చ', ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' వంటి సినిమాల్లోని పాటలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాగే, ‘ఎందుకే', ‘మంగమ్మ', ‘మైసమ్మ', ‘పూర్ బాయ్', ‘మాక్కికిరికిరి', ‘దూరమే', ‘గల్లీ కా గణేష్' సహా ఎన్నో ప్రైవేటు పాటలతో క్రేజ్‌ను అందుకున్నాడు.

  బిగ్ బాస్ విజేత.. ఊకోకాకా అంటూ

  బిగ్ బాస్ విజేత.. ఊకోకాకా అంటూ

  బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌ మూడో సీజన్‌లో పాల్గొనే అవకాశాన్ని అందుకున్నాడు రాహుల్ సిప్లీగంజ్. ఎంతో మంది టైటిల్ ఫేవరెట్లు ఉన్న ఈ సీజన్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా వెళ్లాడతను. అయితే, ఊహించని విధంగా అద్భుతమైన ఆటతీరుతో బిగ్ బాస్ విజేతగా నిలిచాడు. దీని తర్వాత ఊకోకాకా అనే బ్రాండ్‌తో బిజినెస్‌ను కూడా ప్రారంభించి దూసుకుపోతున్నాడు.

  హౌస్‌లో ఆమెతో... బయట ఈమెతో

  హౌస్‌లో ఆమెతో... బయట ఈమెతో

  రాహుల్ సిప్లీగంజ్ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో పునర్నవి భూపాలంతో ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే. అందులో చేసిన రచ్చను కొన్ని రోజుల పాటు బయట కూడా కొనసాగించాడు. దీంతో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. ఇక, ఈ మధ్య అషు రెడ్డితో రిలేషన్‌లో ఉన్నానని చెబుతూ రాహుల్ ప్రకటించి అందరికీ షాకిచ్చాడు.

   అషుతో డేటింగ్... రొమాంటిక్ ఫొటో

  అషుతో డేటింగ్... రొమాంటిక్ ఫొటో

  కొద్ది రోజుల క్రితం రాహుల్ సిప్లీగంజ్.. అషు రెడ్డితో డేటింగ్ చేస్తున్నట్లు ఓ పోస్టు పెట్టాడు. అప్పటి నుంచి వీళ్లిద్దరూ తరచూ కలిసి రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రొమాంటిక్‌గా దిగిన కొన్ని ఫొటోలను సైతం సోషల్ మీడియాలో వదులుతున్నారు. దీంతో వీళ్ల మధ్య వ్యవహారం నిజమేనన్న టాక్ వినిపించింది. అప్పుడు అషు కూడా దీనికి బలాన్నిచ్చేలా మాట్లాడడం విశేషం.

   మరో అమ్మాయితో రాహుల్ రిలేషన్

  మరో అమ్మాయితో రాహుల్ రిలేషన్

  బిగ్ బాస్ హౌస్‌లో పునర్నవి భూపాలంతో, బయటకు వచ్చిన తర్వాత అషు రెడ్డితో కలిసి రచ్చ చేస్తున్నాడు రాహుల్ సిప్లీగంజ్. ఇలాంటి సమయంలో ఇటీవల మరో అమ్మాయితో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో వదిలాడు. ఈ క్రమంలోనే ‘నాతో వందేళ్ల పాటు ఇలాగే ఉండు' అంటూ లవ్ గుర్తునుకూడా పెట్టాడు. దీంతో రాహుల్ సిప్లీగంజ్ ఆమెతో రిలేషన్‌లో ఉన్నాడని అనుకున్నారు.

  అషుకు అక్కడ కిస్ చేసిన రాహుల్

  అషుకు అక్కడ కిస్ చేసిన రాహుల్

  సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రాహుల్ సిప్లీగంజ్ తరచూ ఏదో ఒక పోస్టుతో నెటిజన్లను అయోమయానికి గురి చేస్తూ ఉంటున్నాడు. ఇప్పటికే ఎన్నో రకాల పోస్టులతో అందరినీ షాక్‌కు గురి చేసిన అతడు.. ఇప్పుడు అషు రెడ్డితో దిగిన ఫొటోను షేర్ చేసి అవాక్కయ్యేలా చేశాడు. ఈ రొమాంటిక్ పిక్‌లో ఏకంగా ఆమెకు నుదుటిపై ముద్దు పెడుతూ కనిపించాడీ టాప్ సింగర్.

   సర్‌ప్రైజ్ అనౌన్స్‌మెంట్ అంటూ పోస్ట్

  సర్‌ప్రైజ్ అనౌన్స్‌మెంట్ అంటూ పోస్ట్

  రాహుల్ సిప్లీగంజ్.. అషు రెడ్డికి ముద్దు పెట్టడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేకపోవచ్చు. కానీ, అతడు ఈ ఫొటోకు ‘అషు రెడ్డితో కలిసి సర్‌ప్రైజ్ అనౌన్స్‌మెంట్' అంటూ పోస్ట్ చేయడమే షాక్‌కు గురి చేస్తోంది. ఇక, రాహుల్ చేసిన ఈ పోస్టుపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు అతడికి ఆల్ ది బెస్ట్ అని చెబుతుంటే.. మరికొందరు మరో డ్రామా అంటూ పెదవి విరుస్తున్నారు.

  English summary
  Bigg Boss Telugu Season 3 winner Rahul Sipligunj Kissed Anchor Ashu Reddy. Then He Shared That Pic And Says Surprise Announcement Soon.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X