twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాహుల్‌ సిప్లిగంజ్‌కు గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టున్నారు.. దెబ్బకు సర్దుకున్నాడు!!

    |

    బిగ్ బాస్ షోలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను ఇంటర్వ్యూ చేసేందుకు బిగ్ బాస్ బజ్ అంటూ ఓ షోను ఏర్పాటు చేశారు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు మొదట అక్కడే ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఆ తరువాతే ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టాల్సి ఉంటుంది. అలా మూడో సీజన్ కోసం తనీష్ రంగంలోకి దిగాడు. మూడో సీజన్‌లో ఎలిమినేట్ అవుతూ వచ్చిన కంటెస్టెంట్లను తనీష్ తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేశాడు. ఇక ఈ నాల్గో సీజన్ కోసం రాహుల్ సిప్లిగంజ్ రంగంలోకి దిగాడు.

    స్పెషల్ ఇంటర్వ్యూ..

    స్పెషల్ ఇంటర్వ్యూ..

    ఇంటి నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చే ముందు మొదటి సారిగా కంటెస్టెంట్ల అభిప్రాయాలను తామే క్యాచ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ బజ్‌ను రూపొందించారు. రాహుల్ సిప్లిగంజ్ తన దైన శైలిలో ఈ ఇంటర్వ్యూను ముందుకు తీసుకెళ్తున్నాడు. అయితే శనివారం రాత్రే రాహుల్ సిప్లిగంజ్ ఇంటర్వ్యూ అయిపోయిందంటూ ఓ పోస్ట్ పెడతాడు.

    పోస్ట్‌లో అలా చెప్పేశాడు..

    పోస్ట్‌లో అలా చెప్పేశాడు..

    ప్రతీ శనివారం రాత్రి రాహుల్ సిప్లిగంజ్ ఓ పోస్ట్ పెడతారు. ఈ సారి ఎవరు వచ్చారో తెలుసా? ఎవరిని ఇంటర్వ్యూ చేశానో తెలుసా? ఈ రోజు గెస్ట్‌తో ఇంటర్వ్యూ అయిపోయింది అంటూ కొన్ని ఫోజులు పెడుతూ ఫోటోలను షేర్ చేస్తాడు. ఏడో వారంలోనూ ఇలాగే ఓ పోస్ట్ పెట్టాడు. అధికారికంగా ఎలిమినేట్ అయింది ఎవరన్నది లీక్ చేసేశాడు.

    బ్యాక్ గ్రౌండ్‌లో అలా..

    బ్యాక్ గ్రౌండ్‌లో అలా..

    ఏడో వారంలో దివి ఎలిమినేట్ అయింది. అప్పుడు కూడా రాహుల్ ఓ పోస్ట్ చేశాడు. అయితే ఆ ఫోటోలో బ్యాక్ గ్రౌండ్ వల్ల శనివారం నాడే ఎలిమినేషన్ సంగతిని రాహుల్ బయట పెట్టేసినట్టైంది. బ్యాక్ గ్రౌండ్‌లో ఎలిమినేట్అయిన సభ్యులందరి ఫోటోలుండగా.. అందులో దివి ఫోటో కూడా ఉంది. అలా రాహుల్ ఎలిమినేషన్‌ను లీక్ చేసినట్టైంది.

    Recommended Video

    Rahul Sipligunj New Look Shocks His Fans
    వార్నింగ్ ఇచ్చినట్టుంది..

    వార్నింగ్ ఇచ్చినట్టుంది..

    అలా రాహుల్ వల్ల ఎలిమినేషన్ విషయం లీకవ్వడంతో బిగ్ బాస్ టీం వార్నింగ్ ఇచ్చినట్టుంది. ఎందుకంటే రాహుల్ లీక్ చేసేశాడంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అవి కాస్త బిగ్ బాస్ టీం వద్దకు చేరినట్టున్నాయి. అందుకే కాస్త జాగ్రత్తగా చూసుకో అంటూ రాహుల్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టున్నారు. అందుకే ఈ సారి పొజిషన్‌ను మార్చి ఫోటో దిగాడు.

    English summary
    Rahul Sipligunj Change Position In Bigg Boss Buzz Interview Pic.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X