‘బేబీ’పై వివాదం... అన్నింటికి అక్కడే సమాధానం.. రాహుల్ కామెంట్స్ వైరల్
రాహుల్ సిప్లిగంజ్ ఈ మధ్య ఫుల్ బిజీగా ఉన్నాడు. రాహుల్ బేబీ సాంగ్‌ను అత్యంత భారీ ఎత్తున నిర్మించాడు. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక చేసిన మొదటి ఆల్బమ్ ఇదే. ఈ ఆల్బమ్ కోసం రాహుల్ భారీగానే ఖర్చు పెట్టినట్టు కనిపించింది. బేబీ కోసం మూడు రోజుల పాటు అన్నపూర్ణ స్టూడియో భారీ సెట్స్ వేశాడు. మూడు రోజుల పాటు అహర్నిశలు కష్టపడ్డాడు. ఆ విజువల్స్‌ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే వచ్చాడు.

బేబీ షూటింగ్..
బేబీ కోసం రాహుల్ సిప్లిగంజ్ భారీ కాన్సెప్ట్‌నే ఎంచుకున్నాడు. తెలుగులో ఇండిపెండెంట్ మ్యూజిక్ కోసం శ్రమించే రాహుల్.. బేబీని ఓ లెవెల్‌లో ప్లాన్ చేశాడు. కాన్సెప్ట్ మ్యూజిక్ కంపోజిషన్ అంతా కూడా రాహులే దగ్గరుండి చూసుకున్నాడు. బేబీ ఆల్బమ్‌కు రాహుల్ గొంతు కూడా బాగానే సెట్ అయింది.

వాయిదాలు పడుతూ..
రాహుల్ తన బేబీ ఆల్బమ్‌ను విడుదల చేయడంలో కాస్త తడబడ్డాడు. చెప్పిన టైంకు బేబీని విడుదల చేయలేకపోయాడు. అలా ఓ రెండు సార్లు బేబీ వాయిదా పడింది. ఇక మరోసారి టెక్నికల్ ఇష్యూ వచ్చాయని విడుదల చేసిన బేబీ లింక్‌ను కూడా తీసేశారు. ఇలా బేబీ విషయంలో ప్రతీసారి ఏదో ఒక అడ్డంకి ఏర్పడింది.
Recommended Video

బేబీ వివాదం..
బేబీకి అయిన ఖర్చుపై వివాదాం తలెత్తుతుండటంతో రాహుల్ ఫైర్ అయ్యాడు. నాకు ఇన్ స్టాలో 1.2 మిలియన్ ఫాలోవర్స్, యూట్యూబ్‌లో 800k సబ్‌స్క్రైబర్స్ ఎందుకు ఉన్నారో నాకు తెలియడం లేదు.. మరీ ముఖ్యంగా నేను లైవ్‌లోకి వచ్చాక సిల్లీ ప్రశ్నలు అడక్కండి.. ఓ టాలీవుడ్‌కు అబ్బాయికి బాలీవుడ్ లెవెల్‌లో ఆల్బమ్ తీయాలంటే డబ్బులేమీ అక్కర్లేదు.. అంత పెద్ద మ్యాటర్ కాదని చెప్పాడు.. లైవ్‌లోనే మీకు అన్ని సమాధానాలు చెబుతానని రాహుల్ పేర్కొన్నాడు. కానీ చెప్పిన టైంకు రాహుల్ లైవ్‌లోకి రాలేకపోయాడు.


Click it and Unblock the Notifications











