రాజమౌళి డైరెక్షన్‌లో డేవిడ్ వార్నర్.. జక్కన్నకు మూడు చెరువుల నీళ్లు తాగించిన క్రికెటర్!
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఇటీవల కాలంలో కేవలం సినిమాలో మాత్రమే కాకుండా కొరియోగ్రాఫర్ గా మారిపోయి డాన్సులు కూడా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈయన డాన్స్ కి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే మరోవైపు పలు ప్రాణులను ప్రమోట్ చేస్తూ యాడ్ వీడియోలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈయన ఒప్పో మొబైల్ ఫోన్ ప్రమోట్ చేస్తూ చేస్తున్నటువంటి యాడ్ వీడియో మంచిగా వైరల్ అయింది. ఇకపోతే తాజాగా ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తో కలిసి మరొక యాడ్ వీడియో చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భాగంగా రాజమౌళి క్రికెటర్ డేవిడ్ వార్నర్ కి ఫోన్ చేసి తన క్రికెట్ మ్యాచ్ టికెట్ విషయంలో తనకు డిస్కౌంట్ కావాలని అడిగారు.

జక్కన్న ఇలా అడగడంతో క్రెడ్ యాప్ ఉందా? ఉంటే క్యాష్ బ్యాక్ వస్తుంది అని వార్నర్ రిప్లై ఇవ్వడం.. లేకపోతే ఏం చేయాలని రాజమౌళి అనడంతో యాడ్ స్టార్ట్ అవుతుంది. టికెట్ విషయంలో డిస్కౌంట్ కావాలి అంటే తనకు ఒక ఫేవర్ చేయాలని కోరుతారు. ఆ సమయంలో రాజమౌళి డ్రీమ్స్ లోకి వెళ్తారు. ఇందులో భాగంగా డేవిడ్ వార్నర్ తో రాజమౌళి సినిమా చేస్తున్నట్టు ఏవేవో ఊహించుకుంటారు.
ఒక్కో షాట్, ఒక్కో ఎమోషన్, ఒక్కో స్టెప్‌ని డెవిడ్ వార్నర్ కూనీ చేయడం చూసి రాజమౌళి తలపట్టేసుకుంటాడు. ఇక వార్నర్ తన యాక్టింగ్‌కు ఆస్కార్ వస్తుందని ఊహించి.. ఆస్కార్ స్టేజ్ మీద కలుద్దామని వార్నర్ చెప్పడంతో ఒక్కసారిగా ఈయన షాక్ అవుతారు.అలా కలలోంచి తేరుకుని.. క్రెడ్ యాప్ డౌన్ లోడ్ చేసుకుని పేమెంట్ చేసేస్తాను అని రాజమౌళి అనేస్తాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోపై నేటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
ఇక రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే .ఈ సినిమా ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. RRR సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో మహేష్ బాబుతో చేయబోయే సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో కాకుండా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా భాగం కాబోతున్నారు.


Click it and Unblock the Notifications











