twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి గుండె జరిపోయేలా చేసిన ఈగ.. 10కోట్లతో సగం షూటింగ్ అయ్యాక ఆపేద్దామనుకొని..

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన సినిమాల్లో ఈగ ఒకటి. అప్పటి వరకు ఒక లెక్క.. ఆ తరువాత మరొక లెక్క అనేలా ఈగ టాలీవుడ్ స్థాయిని అమాంతంగా పెంచేసింది. దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి ఎలాంటి సినిమా అయినా చేయగలడని ఆ సినిమాతో మరోసారి రుజువయ్యింది. అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలో ఒకానొక సందర్భంలో రాజమౌళికి గుండె ఆగిపోయినంత పనయ్యిందట. సగం షూటింగ్ అయ్యాక ఆపేద్దామనే ఆలోచన కూడా వచ్చిందట. ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

    మై గాడ్.. బికినీలో సెగలు రేపుతున్న ఇతి ఆచార్య

     ఈగ ముందు కొన్ని విమర్శలు

    ఈగ ముందు కొన్ని విమర్శలు

    రాజమౌళి ఎక్కువగా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను మాత్రమే తీయగలడని ఈగ ముందు వరకు కొన్ని విమర్శలు వచ్చేవి. పైగా కథలన్నీ కూడా ఆయన తండ్రి కె.విజయేంద్రప్రసాద్ మాత్రమే ఇస్తారని అందువల్లే హిట్టవుతాయనే కామెంట్స్ కూడా వచ్చేవి. కానీ జక్కన్న ఆ కామెంట్స్ ను ఎక్కువగా పట్టించుకోలేదు. తన పని తాను సిన్సియర్ గా చేసుకుంటూ వెళ్ళాడు.

    ఈగ ట్రైలర్ కు 4లక్షల వ్యూవ్స్

    ఈగ ట్రైలర్ కు 4లక్షల వ్యూవ్స్

    ఈగ ప్రాజెక్టు ఎనౌన్స్ చేసినప్పుడు పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. కేవలం ఓ వర్గం వారికి మాత్రమే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. కానీ ఎప్పుడైతే ట్రైలర్ యూ ట్యూబ్ లో విడుదల చేశారో అప్పుడు ఒక వారంలో 4 లక్షల వ్యూవ్స్ చూసి జక్కన్న అండ్ టీమ్ ఎంతగానో మురిసిపోయింది. అప్పట్లో ఆ వ్యూవ్స్ చాలా ఎక్కువ.

     ఎప్పుడు లేనంత కష్టాన్ని అనుభవించాడు

    ఎప్పుడు లేనంత కష్టాన్ని అనుభవించాడు

    అయితే ఈగ ప్రాసెస్ అనేది అంత ఈజీగా జరగలేదు. రాజమౌళి ఒక విధంగా తన కెరీర్ లో ఎప్పుడు లేనంత కష్టాన్ని అనుభవించాడు. ఆ కష్టంలోనే ఆనందాన్ని వెతుక్కోవడం ఆయనకు మొదటి నుంచి అలవాటే. ఇక ఈగ విషయంలో జక్కన్నకు ఒకసారి గుండె జారిపోయిందట. సినిమా ఆపెద్దామా అనే ఆలోచన కూడా వచ్చిందట.

     జనాలు చూస్తే తప్పకుండా తిట్టేవారట

    జనాలు చూస్తే తప్పకుండా తిట్టేవారట

    ఈగ క్యారెక్టర్ డిజైనింగ్ విషయం గురించి రాజమౌళి అంతగా పట్టించుకోలేదట. మకుట VFX స్టూడియోస్ వారికే ఆ బాధ్యతను అప్పగించి షూటింగ్ స్టార్ట్ చేశారట. ఇక సగం షూటింగ్ అయిన ఆరు నెలల తరువాత ఈగను సీన్స్ లలో చూసిన జక్కన్న ఒక్కసారిగా షాక్ అయ్యాడట. ఈగ గ్రాఫిక్స్ లో ఏ మాత్రం బాగా లేదట. జనాలు చూస్తే తప్పకుండా తిట్టేవారట.

    అలా అయ్యి ఉంటే.. ఆపేసేవారట

    అలా అయ్యి ఉంటే.. ఆపేసేవారట

    ఆరు నెలల టైమ్ అయిపోయింది. అప్పటికే 10కోట్లు ఖర్చయ్యింది. సినిమా సగం షూటింగ్ కూడా అయిపోయింది. కానీ ఈగ ఏ మాత్రం సెట్టవ్వలేదు. దీంతో రాజమౌళి టెన్షన్ లో పడ్డాడట. నిజానికి ఒక కోటి వరకు ఖర్చయినా కూడా అంతటితో ఆ సినిమాను కచ్చితంగా వదిలేద్దామని అనుకున్నారట. కానీ 10కోట్లకు పైగా ఖర్చు చేయడంతో జక్కన్న విషయాన్ని సిరియాస్ గా తీసుకున్నాడట.

     బడ్జెట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్

    బడ్జెట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్

    ఇక అప్పటి వరకు చేసిన గ్రాఫిక్స్ ను పక్కన పెట్టి అసలు ఈగ క్యారెక్టర్ మీద ఫోకస్ చేశారట. దాని మీద రీసెర్చ్ చేసి ఫొటో షూట్స్ చేసి ఈగ ఎలా ఉండాలి, అది ఎలా ప్రవర్తించాలి అనే విషయాలని జక్కన్న రెడీ చేశాడట. మొత్తం సినిమాను 35కోట్లతో ఫినిష్ చేశారట. ఇక సినిమా తెలుగు తమిళ్ హిందీలో భారీ స్థాయిలో విడుదలయ్యి 100కోట్లకు పైగా కలెక్షన్స్ ను అందుకుంది.

    English summary
    Eega is one of the trend setting movies in the Tollywood industry. With that film, director SS Rajamouli proved once again that he can make any film. However, on one occasion during the shooting of the film, Rajamouli's heart stopped beating. The idea of stopping after half shooting also came up. He remembered that in an interview.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X