twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్లాష్ బ్యాక్.. రామ్ చరణ్‌ డెబ్యూ రాజమౌళి చేతికి.. కానీ ఆ కారణాలతో తిరస్కరించాడట!!

    |

    మెగాస్టార్ చిరంజీవి అంటేనే ఓ రేంజ్ ఉంటే.. ఆయన వారసుడిగా ఎంట్రీ ఇచ్చేవారికి ఇంకెంత రేంజ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. చిరు తనయుడిగా వెండితెరపై ఎంట్రీ ఇస్తున్నాడంటే కొన్ని కోట్ల మంది మంచి ఆశలను, అంచనాలను నెరవేర్చాల్సి ఉంటుంది. భుజాన మోయ లేనంత క్రేజ్, బరువు, బాధ్యతలు అన్నీ ఉంటాయి. అందుకే రామ్ చరణ్ డెబ్యూకు అప్పట్లో ఎన్నో ప్రయత్నాలు చేశారట.

    మెగా ఎంట్రీ..

    మెగా ఎంట్రీ..

    చిరు తనయుడుగా రామ్ చరణ్ ఎంట్రీ కన్ఫమ్ అయింది. అయితే ఎవరి చేతుల మీదుగా అని అందరూ తర్జన భర్జన పడ్డారట. అప్పటికీ పూరి జగన్నాద్, రాజమౌళి తిరుగులేని దర్శకులుగా ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. చిరు మొదటగా రాజమౌళిని సంప్రదించారట.

    డెబ్యూ చాన్స్ రాజమౌళికి..

    డెబ్యూ చాన్స్ రాజమౌళికి..

    రామ్ చరణ్ డెబ్యూ బాధ్యతలను రాజమౌళికి అప్పగించాలని చిరు ఫిక్స్ అయ్యారట. అయితే రాజమౌళి మాత్రం ఆ బాధ్యతను తీసుకోలేకపోయారట. దానికి కూడా స్పష్టమైన కారణాలున్నాయని ఆ తరువాత కొన్ని ఇంటర్వ్యూల్లో ఆ విషయాలను చెప్పుకొచ్చాడు.

    అందుకే వద్దన్నాడట..

    అందుకే వద్దన్నాడట..


    హీరోగా పరిచయం చేసే అవకాశాన్ని తిరస్కరించడానికి రాజమౌళి కారణాలు తెలిపాడు. అతడు ఎలా ఉంటాడు.. ఎలా నటిస్తాడు.. బలబలాలు ఏంటి? డ్యాన్సులు ఫైట్స్.. ఎమోషన్స్ లో ఎలా ఉంటాడు? ఇవేవీ తనకు తెలియక పోవడమే కారణమని చెప్పుకొచ్చాడు. బలబలాలు తెలిస్తే బాగా తీయొచ్చని తెలిపాడు.

    Recommended Video

    RRR Movie Update : SS Rajamouli Serious On Shriya Saran
    అందుకే పూరికి ఛాన్స్..

    అందుకే పూరికి ఛాన్స్..

    అలా ఆ డెబ్యూ ఛాన్స్ పూరి జగన్నాద్ దరికి చేరింది. పూరిపై చిరు, ఫ్యాన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశాడు. చిరుత సినిమాతో రామ్ చరణ్‌లోని ప్రతీ కోణాన్ని ఆవిష్కరించాడు. డ్యాన్సులు, ఫైట్స్, ఎమోషన్స్ ఇలా ప్రతీ ఒక్కటి వెలికిదీశాడు. చిరుత భారీ విజయం దక్కించుకుంది.. ఆపై రాజమౌళి మగధీర సినిమాతో రామ్ చరణ్‌ను ఎవరెస్ట్ అంత ఎత్తులో నిలబెట్టాడు.

    English summary
    Rajamouli Refused to Introduce Ram Charan On Screen. Chiranjeevi asked Rajamouli to Introduce Ram Charan To Tollywood. But He is Refused That offer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X