RRRలో ఈ ఎపిసోడ్స్ హైలైట్: ఆ సీన్ తర్వాత ఆడియెన్స్ సీట్లో కూర్చోలేరట!

By Manoj Kumar P

వరుస విజయాలతో దూసుకుపోతూ టాలీవుడ్‌లోనే టాప్ డైరెక్టర్‌గా వెలుగొందుతున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. వంద శాతం సక్సెస్ రేటుతో జైత్రయాత్ర కొనసాగిస్తున్న ఆయన... 'బాహుబలి' సిరీస్‌తో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వ వ్యాప్తం చేశాడు. ఇంతటి ప్రతిష్టాత్మక చిత్రం తర్వాత జక్కన్న తెరకెక్కిస్తోన్న చిత్రం RRR (రౌద్రం రుధిరం రణం). తెలుగులోని ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా గురించి కొన్ని విషయాలు లీక్ అయ్యాయి. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

రియల్ హీరోల కోసం వాళ్లను కలిపాడు

రియల్ హీరోల కోసం వాళ్లను కలిపాడు

రెండేళ్ళుగా తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోన్న పేరు RRR. రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తుండడమే దీనికి కారణం. డీవీవీ దానయ్య నిర్మాణంలో వస్తున్న ఈ మూవీ పోరాట యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రూపొందుతోంది. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నాడు.

ఇక్కడి వాళ్లే కాదు... అక్కడి స్టార్లు కూడా

ఇక్కడి వాళ్లే కాదు... అక్కడి స్టార్లు కూడా

‘బాహుబలి'తో ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూస్తోంది. దీంతో ఈ సినిమాను కూడా వరల్డ్ వైడ్‌గా విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగానే ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో రూపొందిస్తున్నాడు. ఇందుకోసం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడం, హిందీ చిత్ర పరిశ్రమలకు చెందిన నటులను తీసుకున్నాడు. అలాగే హాలీవుడ్‌నూ టచ్ చేశాడు.

అసలైంది ఆగిపోయింది.. అందుకే లేట్

అసలైంది ఆగిపోయింది.. అందుకే లేట్

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై దాదాపు రెండేళ్లు కావొస్తుంది. అయినప్పటికీ షూటింగ్ ఎనభై శాతం మాత్రమే పూర్తయింది. మిగిలిన భాగంలో ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ చిత్రీకరించాల్సి ఉంది. ఈ కారణంగానే సినిమాను జూలై 30, 2020న విడుదల చేయకుండా వాయిదా వేయాల్సి వచ్చిందన్న విషయం తెలిసిందే.

RRR యూనిట్ ఆశలపై వైరస్ కాటు

RRR యూనిట్ ఆశలపై వైరస్ కాటు

మొదట ప్రకటించిన డేట్‌కు సినిమాను విడుదల చేయలేకపోవడంతో పాటు జనవరి 8, 2021కి వాయిదా వేయడంతో RRR యూనిట్‌పై విమర్శల వర్షం కురిసింది. దీంతో వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని జక్కన్న అండ్ టీమ్ భావించింది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా రూపంలో వాళ్ల ఆశలకు గండి పడింది. ఫలితంగా షూటింగ్ మూడు నెలల పాటు నిలిచిపోయింది.

మళ్లీ వాయిదా... అవన్నీ ముందుకు

మళ్లీ వాయిదా... అవన్నీ ముందుకు

లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌లకు బ్రేక్ పడడం... ఇక, ఇప్పుడేమో కరోనా భయంతో స్టార్స్ బయటకు రాకపోవడంతో చిత్ర పరిశ్రమలో బంద్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాజమౌళి సైతం కరోనా బారిన పడడంతో RRR షూటింగ్ మరింత ఆలస్యం కానుంది. దీంతో సినిమా మళ్లీ వాయిదా పడుతుందని అంటున్నారు. అందుకే కొన్ని సినిమాలు సంక్రాంతి రిలీజ్ అని ప్రకటిస్తున్నాయి.

RRRలో ఈ స్పెషల్ ఎపిసోడ్స్ హైలైట్

RRRలో ఈ స్పెషల్ ఎపిసోడ్స్ హైలైట్

అసలు ఏమాత్రం సంబంధం లేని, ఎప్పుడూ కలవని అల్లూరి సీతారామరాజు, కొమరం భీంల పాత్రలతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రమే RRR. 1920లో ఇంటి నుంచి వెళ్లిపోయిన వీళ్లిద్దరూ విప్లవ వీరులుగా వీళ్లు ఎలా మారారన్న దానిపై జక్కన్న మూవీ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరి మధ్య స్నేహం బంధాన్ని క్రియేట్ చేశాడు. దాన్ని RRR హైలైట్ చేస్తున్నాడని తాజా సమాచారం.

Recommended Video

Bollywood Nepotism : RRR లో ఆలియా భట్ వద్దు అంటున్న Sushant Singh Rajput ఫ్యాన్స్
ఆ సీన్ తర్వాత సీట్లో కూర్చోలేరు.!

ఆ సీన్ తర్వాత సీట్లో కూర్చోలేరు.!

రామ్ చరణ్, ఎన్టీఆర్ పాత్రల మధ్య బలమైన స్నేహాన్ని చూపించబోతున్న రాజమౌళి.. వీళ్లిద్దరి మధ్య ఎమోషనల్ సీన్స్ తెరకెక్కిస్తున్నాడని తాజాగా ఓ న్యూస్ లీకైంది. అంతేకాదు, స్నేహానికి అర్థం చెప్పే ఓ అద్భుతమైన పాటను కూడా ఇందులో పెట్టారట. వీటితో పాటు వీళ్లిద్దరి కలయికలో వచ్చే ఓ దేశభక్తి సీన్.. ఆడియెన్స్‌ను కూర్చిలోంచి లేచి నిలబడేలా చేస్తుందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X