మాహిష్మతి రాజ్యంలో మాస్క్‌లు.. రాజమాళి ఇంట్రెస్టింగ్ కామెంట్
బాహుబలి సినిమా గురించి, అది నెలకొల్పిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రాంతీయంగానే గాకుండా దేశ వ్యాప్తంగా అంతర్జాతీయంగా బాహుబలి మార్మోగిపోయింది. టాలీవుడ్ స్థాయిని అమాంతం పెంచేసింది బాహుబలి. కలెక్షన్లు, రికార్డుల్లో కొత్త శకాన్ని ప్రారంభించింది. రెండు వేల కోట్లు కొల్లగొట్టి ఎప్పటికీ చెక్కు చెదరని రికార్డులను సృష్టించింది. సినిమా వచ్చి మూడేళ్లుఅవుతున్నా.. ఇంకా అందరూ దాని గురించి ఏదో ఒక సందర్భంలో మాట్లాడుకుంటున్నారంటేనే దాని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

అంతర్జాతీయ స్థాయిలో..
బాహుబలి సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాడు దర్శకధీరుడు రాజమౌళి. ప్రభాస్‌ను ప్యాన్ ఇండియన్ స్టార్‌గా మలిచాడు. జక్కన్న మన తెలుగు సినిమాను జాతీయ స్థాయిలో నిలబెట్టాడు. సినీ ఇండస్ట్రీలో నాన్ బాహుబలి రికార్డులనే కొత్త పదాన్ని సృష్టించేలా చేశారు. అంతర్జాతీయ వేదికలపై బాహుబలిని ప్రదర్శించారు.

డొనాల్డ్ ట్రంప్ విషయంలో..
బాహుబలి గత కొన్ని నెలల క్రితం మళ్లీ వార్తల్లో నిలిచింది. డోనాల్డ్ ట్రంప్ ఇండియాను సందర్శించడంపై కొందరు అభిమానులు బాహుబలిని వీడియోను ఎడిట్ చేశారు. అందులో ప్రభాస్ స్థానంలో డొనాల్డ్ ట్రంప్‌ను పెట్టి నానా హంగామా చేశారు. ఈ వీడియోపై ఏకంగా డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించాడు. అయితే ప్రస్తుతం అలాంటి మరో వీడియో తెగ వైరల్ అవుతుంది.

మాస్క్‌లు కచ్చితంగా..
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్ని ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కరోనా విజృంభణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజురోజుకు కరోనా తన ప్రభావాన్ని పెంచుకుంటూ పోతోంది. ఈ క్రమంలో అందరూ వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవడం అనివార్యమయ్యాయి. ఈ క్రమంలోనే మాస్కులు, శానిటైజర్స్ వాడటం అత్యవసరం.
Recommended Video

మాహిష్మతిలోనూ మాస్కులు..
మాస్కుల ప్రాముఖ్యతను చెప్పేందుకు కొందరు బాహుబలి థీమ్‌ను వాడుకుంటున్నారు. క్లైమాక్స్‌లో రానా, ప్రభాస్ తలపడే సీన్స్‌లో మారిద్దరికీ గ్రాఫిక్స్‌లో మాస్కులను పెట్టి వదిలారు. మాహిష్మతిలోనూ మాస్కులున్నాయి..మీరు కూడా వాడాలని సలహా ఇచ్చారు. రాజమౌళి ఇదే వీడియోను షేర్ చేస్తూ ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











