Don't Miss!
- News ముస్లీం రిజర్వేషన్లపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు, మేము వస్తే ఖేల్ కథం !
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్‌పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
వకీల్ సాబ్ వీక్షిస్తోన్న రాజమౌళి.. త్వరలోనే దర్శకధీరుడి రివ్యూ!
టాలీవుడ్ అంతటా కూడా ఇప్పుడు వకీల్ సాబ్ హవానే కనిపిస్తోంది. ప్రతీ ఒక్క హీరో కూడా వకీల్ సాబ్ గురించి, పవన్ కళ్యాణ్ నటన గురించి ప్రశసంలు కురిపిస్తూనే ఉన్నారు. చిరంజీవి తన ఆనందాన్ని సోషల్ మీడియాలో ట్వీట్ల రూపంలో పంచుకోవడమే కాకుండా దర్శక నిర్మాతలను ఏకంగా ఇంటికి పిలిపించుకుని మరీ సత్కరించాడు. ఇక నాగబాబు అయితే ఏకంగా ఓ వీడియోను వదిలాడు. చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకుంటూ వకీల్ సాబ్ మీద రివ్యూ ఇచ్చేశాడు.
రామ్ చరణ్, మహేష్ బాబు వంటి వారు కూడా వకీల్ సాబ్ గురించి ట్వీట్లు పెట్టేశారు. ఇక ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి వంతు రాబోతోన్నట్టు కనిపిస్తోంది.ఏదైనా ఒక మంచి సినిమా వచ్చిందంటే వెంటనే చూసేస్తాడు జక్కన్న. సినిమాను చూసిన వెంటనే దాని మీద తన అభిప్రాయాన్ని అందరితో పంచుకుంటాడు. అలా ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి వకీల్ సాబ్ సినిమాను చూస్తోన్నట్టు తెలుస్తోంది.
ఏఎంబీ మాల్లో రాజమౌళి తన ఫ్యామిలీతో కలిసి వకీల్ సాబ్ సినిమాను వీక్షిస్తోన్నట్టు కనిపిస్తోంది. ఈ మేరకు ఏఎంబీ వారు ఓ ట్వీట్ వేశారు. రాజమౌళి వచ్చారు.. తన ఫ్యామిలీతో కలిసి సినిమా చూస్తున్నారంటూ కొన్ని ఫోటోలను షేర్ చేశారు. అయితే రాజమౌళి వకీల్ సాబ్ సినిమానే చూస్తున్నాడని, సాయంత్రం లోపు ఓ ట్వీట్ వేస్తారని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్‌ను రాజమౌళి ఏ రేంజ్లో పొగుడుతాడో చూడాలి.