తండ్రొకటి తలిస్తే... రాజశేఖర్ చిన్న కూతురు మరొకటి తలిచింది!
తండ్రి ఒకటి తలిస్తే.... రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక మరొకటి తలిచింది. దీంతో కూతురు కోరికను కాదనలేక ముందుగా తాను అనుకున్న ప్లాన్స్ అన్న పక్కన పెట్టేశాడట ఈ యాంగ్రీ యంగ్‌మెన్. జీవిత, రాజశేఖర్ దంపతుల ఇద్దరు కూతుర్లలో పెద్దమ్మాయి శివానీ ఇప్పటికే హీరోయిన్‌గా కెరీర్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. చిన్నమ్మాయి శివాత్మికను సినిమాల వైపుకాకుండా మరో మార్గంలోకి మళ్లించాలని అనుకున్నారు. మొదట వారి నిర్ణయానికి ఒకే చెప్పిన ఆమె... ఇపుడు నిర్ణయం మార్చుకుందట.
Recommended Video


శివాత్మికకు ఆ బాధ్యతలు అప్పగించాలనుకున్నారు
ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఒక స్కూల్ ఏర్పాటు చేసి దాని బాధ్యతలు శివాత్మికకు అప్పగించాలనుకున్నారట జీవిత, రాజశేఖర్ దంపతులు. అయితే శివాత్మిక అందుకు సముఖుత వ్యక్తం చేసినా... తర్వాత తన మనసు మార్చుకుందట.

నాకు అలాంటి జీవితమే కావాలి
తన సోదరి శివాని ఆల్రెడీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడం, మోడలింగ్, ఫోటో షూట్లతో బిజీ అవ్వడం, సెలబ్రిటీ స్టేటస్ సొంతం చేసుకోవడం చూసి... తనకు కూడా అలాంటి జీవితమే కావాలని, తాను కూడా సినిమాల వైపు వస్తానని తల్లిదండ్రుల ముందు తన మనసులోని మాట బయట పెట్టిందట శివాత్మిక.

స్వయంగా ప్రకటించిన రాజశేఖర్
తన చిన్న కూతురు సినిమాల్లోకి రావాలని ఆశ పడుతున్నట్లు ఇటీవల జీవిత రాజశేఖర్ స్వయంగా చెప్పారు. సో.. త్వరలోనే మనం తెరపై మరో కొత్త తెలుగు హీరోయిన్‌ను చూడబోతున్నామన్నమాట.

శివానీ మూవీ
హిందీలో సూపర్ హిట్ అయిన ‘2 స్టేట్స్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా రాజశేఖర్ పెద్ద కూతురు శివానీ హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ఇందులో అడివి శేష్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











