సుమను బిగ్ బాస్‌కు పంపించకండి.. అది మేం తట్టుకోలేం.. రాజీవ్ కనకాలకు నెటిజన్ల సందేశాలు!!

బిగ్ బాస్ టీం టీఆర్పీలు పెంచుకునేందుకు, షో పై హైప్ క్రియేట్ చేసేందుకు ఎలాంటి జిమ్మిక్కులు చేసేందుకు కూడా వెనకడాటం లేదు. అందుకే డబుల్ ఎలిమినేషన్ అంటూ జనాలను పిచ్చోళ్లను చేయడం, ఫేక్ ఎలిమినేషన్ అంటూ మళ్లీ కవరింగ్ చేయడం, గెస్ట్‌గా వచ్చిన సుమను వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ బజ్ క్రియేట్ చేసుకోవడం వంటివి అందులో భాగమే. అయితే గత వారం వీకెండ్ ఎపిసోడ్‌లో సుమ వల్ల షో బాగానే నిలిచింది.

 వైల్డ్ కార్డ్ ఎంట్రీ..

వైల్డ్ కార్డ్ ఎంట్రీ..

సుమ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతోందంటూ ప్రోమోలతో బాగానే హైప్ క్రియేట్ చేశారు. చేతిలో సూట్ కేస్ కూడా పట్టుకొచ్చింది. నిజంగానే వైల్డ్ కార్డ్ అన్నంత బిల్డప్ ఇచ్చారు. అయితే బిగ్ బాస్ టీం ఎన్ని మాయలు చేసినా నెటిజన్లు మరీ అంత అమాయకంగా అయితే లేరు. ప్రోమోను చూసి అది పబ్లిసిటీ స్టంట్ అని తేల్చేశారు.

గంగవ్వ వయసులో..

గంగవ్వ వయసులో..

అయితే చివర్లో సుమ కేవలం గెస్ట్‌గా వచ్చానని అసలు విషయం చెప్పేసింది. బిగ్ బాస్ షో అంటే మామూలు విషయం కాదు.. అందులోకి రావాలంటే ఎంతో గట్స్ ఉండాలని చెప్పుకొచ్చింది. తనకు కూడా గంగవ్వ అంత వయసు వచ్చాక బిగ్ బాస్ షోలోకి వస్తానని సెటైర్ వేసింది.

రాజీవ్ రియాక్షన్..

రాజీవ్ రియాక్షన్..

అయితే తాజాగా రాజీవ్ కనకాల సుమ బిగ్ బాస్ ఎంట్రీపై స్పందించాడు. సుమ బిగ్ బాస్‌లోకి వెళ్లదని చెప్పాడు. గంగవ్వ వయసు వచ్చాక వెళ్తానని సుమ చెప్పింది కదా అని అన్నాడు. అప్పుడు వెళ్లనిస్తారా? అని అడిగితే.. ఆమె ఎప్పుడు వెళ్తానన్నా ఓకే అంటానని చెప్పాడు.

Recommended Video

Anchor Suma Serious On Telugu Peope Behavior | చెప్పేది మీకే.. అర్దం కావట్లేదా..?
అలాంటి మెసెజ్‌లు..

అలాంటి మెసెజ్‌లు..

సుమ బిగ్ బాస్‌లో వస్తోందని ఐపీఎల్ మ్యాచ్‌లను కూడా చూడలేదు. అయితే సుమ నిజంగా బిగ్ బాస్ షోలోకి వెళ్తోందని అనుకున్న ఫ్యాన్స్ నాకు మెసెజ్‌లు చేశారని రాజీవ్ తెలిపాడు. సుమక్కను బిగ్ బాస్‌లోకి పంపించకండి.. ఆమెను ఎవ్వరైనా నెగెటివ్‌గా అంటే మేం తట్టుకోలేమని మెసెజ్‌లు పంపించారు అని రాజీవ్ కనకాల పేర్కొన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X