twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోగా రోషన్ మూవీ ప్రారంభం.. సుమ-రాజీవ్ కనకాల ప్లాన్ మామూలుగా లేదు!

    |

    రాజీవ్ కనకాల ఆ మధ్య ఓసారి ఫేస్ బుక్ లైవ్‌లోకి వచ్చి చాలా విషయాలే చెప్పాడు. సుమ వెబ్ సిరీస్ ప్లానింగ్స్, నిర్మాతగా తాను చేయబోతోన్న ప్రాజెక్ట్‌లు, తన కొత్త యూట్యూబ్ చానెల్‌, కొడుకు హీరోగా ఎంట్రీ ఇలా ఎన్నో విషయాలపై రాజీవ్ కనకాల స్పందించాడు. మొత్తానికి సుమ రాజీవ్ కనకాల కన్న కల నేడు నిజమైంది. సుమ రాజీవ్‌ల వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని తనయుడు రోషణ్ కనకాల హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

    కొత్త వారితో..

    కొత్త వారితో..

    రోషన్‌ను హీరోగా ఎంట్రీ ఇప్పించేందుకు కొత్త వారితోనే ప్రయోగం చేయబోతోన్నారు. కొత్త దర్శకుడు విజయ్ చెప్పిన కథకు ఫిదా అయిన సుమ రాజీవ్ తమ కుమారుడిని హీరోగా లాంచ్ చేసేందుకు అంతా రెడీ చేశారు. నేడు ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.

    వినాయకుడి గుడిలో..

    వినాయకుడి గుడిలో..

    సుమ రాజీవ్ కనకాలతో పాటు చిత్రయూనిట్ అందరూ వినాయకుడి గుడిలో పూజలు చేశారు. స్క్రిప్ట్‌కు ప్రత్యేకంగా పూజ జరిపించారు. ఆ తరువాత విజయమాలలను దర్శకుడు, నిర్మాతలు, హీరోకు రాజీవ్ వేశాడు. మొత్తానికి ఇలా కొత్త వారితో మంచి ప్రయోగానికే సిద్దమైనట్టు తెలుస్తోంది.

    సుమ సైతం..

    సుమ సైతం..

    సుమను కూడా యాక్టింగ్ వైపు మళ్లీ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్. ఏదో వెబ్ సిరీస్ కోసం సుమను తీసుకుంటున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా రాజీవ్ సైతం నిర్మాణ రంగంలో దూకుడు ప్రదర్శించేందుకు సిద్దమైనట్టు కనిపిస్తోంది.

     యూట్యూబ్‌లో అలా..

    యూట్యూబ్‌లో అలా..

    రాజీవ్ కనకాల యూట్యూబ్ చానెల్ అయిన మనస్వీని మూవీ మ్యూజిక్ క్రియేషన్స్‌లో వీఐపీ జర్నీ అంటూ సెలెబ్రిటీలను ఇంటర్వ్యూ చేయిస్తున్నాడు. అది కూడా బాగానే క్లిక్ అయింది. ఇప్పుడు సుమ యాంకర్, నటనలో బిజీగా ఉంటోండగా.. రాజీవ్ నిర్మాణ పనుల్లో బిజీ కానున్నాడు. ఇక రోషన్ హీరోగా సినిమా షూటింగ్‌తో బిజీ కానున్నాడు.

     రొమాంటిక్ కథ..

    రొమాంటిక్ కథ..

    కొత్త దర్శకుడు విజయ్ చెప్పింది ఓ రొమాంటిక్ స్టోరీ అని తెలుస్తోంది. నిర్మాతలు ఎవరైనా కూడా.. సుమ రాజీవ్ కనకాల మొత్తం బాధ్యతలు భుజాన వేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.

    English summary
    Rajeev Kanakala Suma Son Roshan Debut Movie Launched, Rajeev Kanakala Turns Producer, recently Rajeev Kanakala came Into Live And Anounces Some Interesting Projects.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X