కొడుకును హీరోగా.. సుమతో ఓ వెబ్ సిరీస్.. రాజీవ్ కనకాల ప్లానింగ్ అదుర్స్!!
రాజీవ్ కనకాల గురించి, ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళి, ఎన్టీఆర్ సినిమాల్లో రాజీవ్ కనకాల ప్రదర్శించే నటన అసామాన్యంగా ఉంటుంది. స్టూడెంట్ నెం 1 నుంచి జనతా గ్యారెజ్ వరకు ఎన్టీఆర్-రాజీవ్ కనకాల కాంబో ఎంతగా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఓ సై, విక్రమార్కుడు, నాయక్ ఇలా చెప్పుకుంటూ పోతే రాజీవ్ కనకాల నటనను పొగడటానికి పదాలే ఉండవు. అలాంటి రాజీవ్ కనకాల తాజాగా ఫేస్‌బుక్ లైవ్ లోకి వచ్చాడు.

యూట్యూబ్ చానెల్..
రాజీవ్ కనకాల యూట్యూబ్ చానెల్ అయిన మనస్వీని మూవీ మ్యూజిక్ క్రియేషన్స్ గురించి అప్డేట్ ఇచ్చేందుకు వచ్చాడు. అందులో వీఐపీలు, సెలెబ్రిటీల ఇంటర్వ్యూలు, షార్ట్ ఫిలింలు రాబోతోన్నాయని తెలిపాడు. అందరూ సపోర్ట్ చేయాలని కోరాడు. త్వరలోనే కొత్త యాంకర్, కొత్త డై రెక్టర్, కొత్త టీంతో వీక్షకుల ముందుకు రాబోతోన్నట్టు ప్రకటించాడు.

కొడుకును హీరోగా..
అయితే ఇలా లైవ్‌లోకి వచ్చిన రాజీవ్ కనకాలను నెటిజన్లు పలు ప్రశ్నలు అడిగారు. కొడుకును ఎప్పుడు లాంచ్ చేయబోతోన్నారని ప్రశ్నించారు. అయితే 2021లో డెబ్యూ ఇవ్వబోతోన్నాడని, అయితే మొదటి చిత్రం తాను నిర్మించడం లేదని, బహూషా రెండో చిత్రం నిర్మించే అవకాశం ఉందని తెలిపాడు.

సుమతో వెబ్ సిరీస్..
వెబ్ సిరీస్, షార్ట్ ఫిలింలు కూడా తీయండని సలహాలు ఇచ్చారు. అవి కూడా ప్లాన్ చేస్తున్నామని, షార్ట్ ఫిలింల ద్వారా కొత్త టాలెంట్ వస్తుందని అన్నాడు. ఇక సుమను మెయిన్ లీడ్‌గా పెట్టి ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేయండని సలహా ఇచ్చారు కొందరు. అలాంటి ఓ ప్రపోజల్ కూడా బయట జరుగుతోందని, తాను కూడా చేస్తానని తెలిపాడు. ఇక ఇద్దరూ కలిసి నటించాలని కోరడంతో అలాంటి సందర్భం వస్తే తప్పకుండా చేస్తామని అన్నాడు.
Recommended Video

జుట్టుకు రంగు..
ఓ అభిమాని మాత్రం సరదాగా ఓ కామెంట్ చేసింది. జుట్టుకు రంగు వేసుకోండి సర్ అని సలహా ఇచ్చింది. ఇప్పుడు రెండు నెలల వరకు ఇదే ఉండాలి.. పెప్పర్ సాల్ట్ లుక్ ట్రెండ్ నడుస్తోంది కదా కొన్ని ప్రాజెక్ట్‌ల కోసం ఇదే లుక్ ఉండాలి అందుకే ఉంచాను అని చెప్పుకొచ్చాడు. తాజాగా తాను నటించిన మెట్రో కథలు సినిమాను చూడమని సలహా ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











