అందుకే ఆ గుర్తును ఎంచుకున్నాడా?.. రజినీకాంత్ పార్టీ చిహ్నంపై రచ్చ
సూపర్ స్టార్ రజినీ కాంత్ ఎంతో కాలం నుంచి ఊరిస్తూ వస్తోన్న ఓ విషయంపై క్లారిటీ ఇచ్చేశాడు. తాను రాజకీయాల్లోకి రాబోతోన్నా అంటూ స్పష్టం చేసేశాడు. అందుకు తగ్గట్టు కార్యాచరణ కూడాప్రారంభించేశాడు. రాజకీయ కార్యక్రమాలు మొదలుపెట్టేలోపే సినిమా పనులన్నీ పూర్తి చేయాలన్న ఉద్దేశ్యంతో రజినీ ఉన్నట్టు తెలుస్తోంది.అందుకే ఈ రోజు నుంచి అన్నాత్తె షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు రజినీ. ఓ వైపు షూటింగ్ పూర్తి చేస్తూనే మరో వైపు పార్టీ పేరు, గుర్తుపై కసరత్తులు చేస్తున్నాడు.
రజినీ అభిమానులు ఎన్నో యేళ్లుగా ఎదురుచూస్తున్నఈ ఘట్టం 2020లో నిజం కానుంది. రజినీ రాజకీయాల్లోని వచ్చే అంశం ఎప్పుడూ హాట్ టాపిక్కే. చివరగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ రజినీ పాల్గొంటాడని అందరూ అనుకున్నారు. కానీ దాన్ని అసెంబ్లీ ఎన్నికలక వాయిదా వేశాడు. మొత్తానికి పార్టీకి సంబంధించి అధికారికంగా ప్రకటించాడు. పార్టీ పేరు మక్కల్ సేవై కట్చి అని తెలుస్తోంది. అంటే ప్రజా సేవ అనే అర్థంలో అలా పెట్టారట.

ఇక పార్టీ సింబల్‌గా సామాన్యులకు చిహ్నమైన ఆటోను తీసుకున్నారట. ఆటోకు రజినీకాంత్‌కు ఎంతో సంబంధం ఉంది. రజినీ స్టార్డంను ఎవరెస్ట్ అంత ఎత్తులో నిలబెట్టింది భాషా సినిమా. అందులో రజినీ ఆటో డ్రైవర్‌గా అదరగొట్టేశాడు. అలా అందులో నేను ఆటో వాడ్ని ఆటో వాడ్ని అంటూ అదిరిపోయే పాటకు స్టెప్పులు కూడా వేశాడు. అందుకే అన్ని ఆలోచించి.. సామాన్యులకు ప్రతినిధిగా ఉండే ఆటోను రజినీ పార్టీ సింబల్‌గా తీసుకున్నాడని చర్చ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











