twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాషా అలా పుట్టాడట.. రజనీకాంత్ మూవీ వెనుక అమితాబ్, గోవిందా!

    |

    సినిమా పరిశ్రమలో కథలు ఒక్కొసారి చాలా విచిత్రంగా పుడుతుంటాయి. ఏదో విషయంపై చర్చ జరిగితే అది మరో సినిమా కథగా మారి చరిత్ర సృష్టించిన దాఖలాలు చాలానే ఉన్నాయి. అలాంటి కోవలోకే రికార్డులు తిరుగరాసిన బాషా చేరుతుంది. బాషా సినిమా కథ ఎలా పుట్టింది? దానిని ఎన్ని రోజుల్లో రాసి తెరకెక్కించారనే విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. రజనీకాంత్ ఇమేజ్‌ను మార్చేసిన బాషా మూవీ గురించి సవివరంగా..

    బాలీవుడ్ చిత్రం హమ్ షూటింగ్‌లో

    బాలీవుడ్ చిత్రం హమ్ షూటింగ్‌లో

    తమిళ చిత్రాలతోపాటు రజనీకాంత్‌ హిందీ చిత్రాల్లో కూడా నటించి మెప్పించిన విషయం తెలిసిందే. 1991లో అమితాబ్, గోవిందా, రజనీకాంత్ నటించిన హమ్ చిత్ర షూటింగ్ ఊటీలో జరిగింది. ఆ చిత్రానికి ముకుల్ ఎస్ ఆనంద్ దర్శకుడు. ఆ సినిమా షూటింగ్‌లో జరిగిన ఓ సంఘటన బాషా సినిమా కథకు బీజం వేసింది.

    హమ్ సినిమాలో గోవిందా కోసం సీన్

    హమ్ సినిమాలో గోవిందా కోసం సీన్

    హమ్ చిత్రంలో పోలీస్ ఆఫీసార్ ఉద్యోగం కోసం గోవిందా ఇంటర్వ్యూకు వెళ్తాడు. ఆ ఇంటర్వ్యూలో గోవిందాకు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరిస్తారు. ఆ సమయంలో ఇంటర్వ్యూ రూమ్‌లోకి ప్రవేశించిన అమితాబ్ బచ్చన్ తన మార్క్ తడాఖా చూపించి గోవిందాకు ఉద్యోగం ఇచ్చేలా చేస్తాడు. ఆ సీన్‌ను గోవిందా, అమితాబ్, రజనీకాంత్ సినిమా కోసం తయారు చేశారు. అయితే స్క్రీన్ ప్లేలో ఆ సీన్ సెట్ కాకపోవడంతో ఉపయోగించుకోలేదు.

    హమ్ కోసం సీన్‌ బాషాకు అంకురార్పణ

    హమ్ కోసం సీన్‌ బాషాకు అంకురార్పణ

    హమ్ సినిమా తర్వాత అన్నామలై చిత్రం కోసం రజనీకాంత్, సురేష్ కృష్ణ పనిచేశారు. ఆ సినిమా షూటింగ్ సందర్భంగా హమ్ సినిమా కోసం బిగ్ బీ, గోవిందా, తాను చేసిన సీన్ గురించి చెప్పి.. ఆ సీన్ పెట్టి ఉంటే బాగుండేదనే అభిప్రాయాన్ని రజనీ వ్యక్తం చేశారు. రజనీ చెప్పిన ఆ సీన్ సురేష్ కృష్ణ మెదడును తొలచి వేయడం మొదలుపెట్టింది.

    ఆరు నెలల్లోనే పూర్తి చేయాలని

    ఆరు నెలల్లోనే పూర్తి చేయాలని

    రజనీకాంత్ చెప్పిన సీన్ ఆధారంగా దర్శకుడు సురేష్ కృష్ణ కథను వండే ప్రయత్నంలో పడ్డారు. 1994లో వీరా సినిమా పూర్తయ్యే సమయానికి బాషా సినిమా కథ రెడీ అయింది. రజనీకాంత్ చేతిలో వెంటనే సినిమా లేకపోవడంతో వెంటనే ప్రారంభించారు. 1995 పొంగల్ లక్ష్యంగా సినిమాను రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు.

    మాణిక్ బాషా డైలాగ్స్‌తో

    మాణిక్ బాషా డైలాగ్స్‌తో

    దర్శకుడు రజనీకాంత్, రజనీకాంత్ అనుకొన్నదే తడవుగా సినిమాను పట్టాలెక్కించారు. ఆరు నెలల్లోనే బాషాను తెరకెక్కించి రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఎలాంటి చరిత్రలను ఆటో డ్రైవర్ మాణిక్ బాషా తిరగరాశారో అందరికి తెలిసిందే. ఈ చిత్రంలోని బాషా ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టే అనే డైలాగ్, రజనీ స్టైల్, బాడీ లాంగ్వేజ్ అభిమానులను ఉర్రూతలూగించడంతో కలెక్షన్ల సునామీ నమోదైంది.

    Recommended Video

    Kushboo Made Comments on Rajinikanth's Political Entry
    బాషాకు బలాలు అవే..

    బాషాకు బలాలు అవే..

    బాషా చిత్రం విజయానికి రజనీకాంత్ ఒక ఎత్తు అయితే.. మార్క్ ఆంథోనిగా రఘువరన్ విలనిజం సినిమాను మరో మెట్టెక్కింది. సురేష్ కృష్ణ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సినిమాకు వెన్నెముకగా మారింది. దక్షిణాదిలో బాషా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రజనీ కెరీర్‌లో గొప్ప చిత్రంగా బాషా నిలిచింది.

    English summary
    Rajinikanth and Suresh Krissna's Baashha movie had interesting story. The story was based on Hum Movie scene which not in the movie. One of the inspiration thoughts of Amitabh Bachchan and Govinda made Baashha movie possible on silverscreen.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X