రజనీ వద్ద ఎన్ని కార్లు ఉన్నాయో తెలుసా? లేటేస్ట్‌గా రూ.22 కోట్ల ఖరీదైన కారుతో..

సూపర్ స్టార్ రజనీకాంత్‌కు నటన, సామాజిక సేవ పట్లే కాకుండా రకరకాల కార్లను కొనుగోలు చేసి సొంతం చేసుకోవడాన్ని కూడా ఇష్టపడుతుంటారు. తాజాగా లాంబోర్గిని కారును స్వయంగా నడుపుకొంటూ కూతురు ఇంటికి వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియా హల్‌చల్ రేపుతున్నాయి. దాంతో తాజాగా రజనీకాంత్‌ వద్ద ఉన్న కార్లు, వాటి విలువ చర్చనీయాంశమైంది. రజనీకాంత్ వద్ద ఉన్న కార్లు.. వాటి రకాలను పరిశీలిద్దాం.

లాంబోర్గిని ఉరుస్ కారు ఖరీదు ఎంతంటే

లాంబోర్గిని ఉరుస్ కారు ఖరీదు ఎంతంటే

రజనీకాంత్ నడిపిన లాంబోర్గిని ఉరుస్ కారు గురించి చర్చ వైరల్ అవుతున్నది. ప్రపంచంలోనే అత్యంత మన్నిక గల సూపర్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (ఎస్‌యూవీ) కారుగా ఓ ఘనతను సాధించింది. కారు డిజైన్, లుక్ అద్భుతంగా ఉంటుంది. కారుపై పరుగులు పెడుతుంటే దాని రాజసం వేరేలా ఉంటుంది. ఇటాలియన్ నిపుణులచే ఇంటీరియర్ డిజైన్ చేయబడింది. ఈ కారు ఖరీదు రూ.3 కోట్లకుపైనే అని చెబుతున్నారు.

రజనీకాంత్ మొట్టమొదటి కారు ఏదంటే

రజనీకాంత్ మొట్టమొదటి కారు ఏదంటే

రజనీకాంత్‌కు కార్ల కలెక్షన్ అంటే ఇష్టం. మొదటిసారి రజనీ 1980లో ప్రీమియర్ పద్మినీ కారును కొనుగోలు చేశారు. ఇప్పటికీ ఆ కారు ఇంకా తన వద్దే ఉంది. కేవలం దానిని అలా పెట్టకుండా ఫుల్ కండీషన్‌లో ఎప్పుడూ ఉంచుతారని సన్నిహితులు చెబుతుంటారు. అలాంటి కార్లు దేశంలోనే అరుదుగా కనిపిస్తాయి.

ఇష్టమైన అంబాసిడర్ కారుతో

ఇష్టమైన అంబాసిడర్ కారుతో

రజనీకాంత్ వద్ద ఉన్న కార్లలో ఆయనకు ఇష్టమైన వాటిలో అంబాసిడర్ ఒకటి. యూకేలోని మోరిస్ మోటార్స్ ప్రైవేట్ తయారు చేసిన ఆక్స్‌ఫర్డ్ సిరీస్ 111 మోడల్ కారును అప్పట్లో కొనుగోలు చేశారు. 80, 90 దశకాల్లో అలాంటి కారును కేవలం ఉన్నతాధికారులే ఉపయోగించేవారు. త్వరలోనే ఇలాంటి క్లాస్‌ కారును పీజియట్ త్వరలోనే మళ్లీ వినియోగదారుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నది.

 ఇన్నోవా, బీఎండబ్ల్యూ కారు

ఇన్నోవా, బీఎండబ్ల్యూ కారు

ఇక రజనీ సొంతం చేసుకొన్న కార్లలో 1.8 లీటర్ ఐ వీటెక్ ఇంజిన్ కెపాసిటీ ఉన్న హోండా సివిక్ కారు, జపాన్ ఉత్పత్తిదారులు అందించిన బెస్ట్ సెల్లర్ కారు టయోటా ఇన్నోవా ఉన్నాయి. ఆయన కలెక్షన్లలో బీఎండబ్ల్యూ ఎక్స్5 కారు కూడా ఉంది. అంతేకాకుండా రజనీ వద్ద మర్సెడెజ్ బెంజ్ జీ క్లాస్ కూడా ఉండటం గమనార్హం.

Recommended Video

Kushboo Made Comments on Rajinikanth's Political Entry
22 కోట్ల లిమౌసిన్ కారుతో

22 కోట్ల లిమౌసిన్ కారుతో

రోల్స్ రాయస్ గోస్ట్, రోల్స్ రాయస్ ఫాంథామ్ లాంటి కార్లు కూడా తన కలెక్షన్‌లో ఉన్నాయి. అలాగే ప్రత్యేకంగా డిజైన్ చేసిన లిమౌసిన్ కారు కూడా రజనీ వద్ద ఉంది. ధాని ఖరీదు రూ.22 కోట్లుగా అంచనా వేస్తున్నారు. కేవలం వాటిని కొనుగోలు చేయడమే కాకుండా పాత కార్లను చాలా ఇష్టంగా, భద్రంగా చూసుకొంటారని స్నేహితులు చెబుతుంటారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X