Just In
Don't Miss!
- Sports
గబ్బా హీరో రిషభ్ పంత్.. తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయి.!
- Finance
కంపెనీలు ఆ నిర్ణయం తీసుకుంటే.. వచ్చే అయిదేళ్లలో ప్రపంచ వృద్ధిలో భారత్ వాటా 15%
- News
Inside info:జగన్ -షా మీటింగ్లో ఏం జరిగింది.. మళ్లీ ఢిల్లీకి సీఎం: ఏపీలో కీలక పరిణామాలు
- Lifestyle
బాదం చట్నీతో బోలెడన్నీ లాభాలు... దీన్ని ఈ సమయంలోనే ఎక్కువగా తినాలట...!
- Automobiles
2030 నాటికి భారత్లో రోడ్డు ప్రమాదాలు సున్నా చేయడానికి కేంద్రం ముందడుగు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మల్దీవులను హీటెక్కిస్తున్న మన బికినీ పాపలు...
లాక్ డౌన్ లో ఊపిరి బిగబెట్టుకుని కూర్చున్న సెలబ్రిటీలు అందరూ ఇప్పుడు రెక్కలు వచ్చిన పక్షుల్లా ఎగిరిపోతున్నారు. ఇక టాలీవుడ్ జనాలకు మల్ధీవుకు పెద్ద హాలిడే డెస్టినేషన్ అయింది. ఇటీవలే సమంత, నాగ చైతన్య... అక్కడే హాలీడేను ఎంజాయ్ చేసి తిరిగివచ్చిన సంగతి తెలిసిందే. సామ్ హాటు హాటు ఫొటోలతో అభిమానులకు వీనుల విందుచేసినా బికినీకి మాత్రం నో చెప్పేసింది. దీంతో ఆడియన్స్ కాస్త అప్సెట్ అయినా ఆ లోటును భర్తీ చేసేందుకు మరో ఇద్దరు ముద్దుగుమ్మలు నడుం బిగించారు.
దీపావళి ముగుస్తూనే మల్దీవుల్లో సేద తీరేందుకు ముద్దుగుమ్మలందరూ అటువైపు క్యూ కట్టేసిన సంగతి తేలిసిందే. సముద్ర తీరాన్న బికినీల్లో అందాలు ఆరబోస్తూ అక్కడి వాతావరణంతో పాటూ సోషల్ మీడియాలోనూ సెగలు పుట్టించేస్తున్నారు. ఇక మన వయ్యారి భామలు రకుల్, తాప్సీ రకరకాల భంగిమల్లో ఇన్స్టాగ్రామ్ ను ఓ ఊపు ఊపేస్తున్నారు.

ఇక వీరి అందాల విందుకు ఓ చిన్న పోటీ పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన రావడమే తరువాయి ఓ జాతీయ వెబ్ ఛానల్ పోలింగ్ నిర్వహించేసింది. దాని ఫలితాలు కూడా అదే రేంజ్ లో వచ్చాయి. అయితే అందాలు ఆరబోయడంలో రకుల్, తాప్సీ హోరాహోరీగానే తలపడ్డారని చెప్పాలి.
ఈ బికినీ పోటీలో అభిమానులకు తాప్సీ వేసిన బ్లూ కలర్ మోనోకిని కన్నా రకుల్ వేసిన ఆరెంజ్ బికినీకే పట్టం కట్టేశారు. ఇద్దరూ టూపీసెస్ లో సూపర్ హాట్ గా కనిపిస్తున్నా రకుల్ తడారిన కురులు, మత్తెక్కించే అందాలకు కొన్ని ఓట్లు ఎక్కువగానే పడ్డాయి. తాప్సీకి 43శాతం ఓట్లు పడగా, తాప్సీకి 57శాతం ఓట్లు లభించాయి. ఇక వర్క్ విషయానికి వస్తే తాప్సీ ప్రస్తుతం రష్మీ రాకెట్ ప్రాజెక్ట్ తో బిజీగా ఉండగా, రకుల్ సైతం తెలుగులో పలు సినిమాల్లో నటిస్తోంది.