ఫ్యామిలీతో మాల్దీవుల్లో రచ్చ.. బికినీతో అందరి మతులు పోగొడతున్న రకుల్ ప్రీత్
రకుల్ ప్రీత్ వెండితెరపై ఎంత యాక్టివ్‌గా ఉంటుందో సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్‌గా ఉంటుంది. యోగాలు, వ్యాయమాలు అంటూ రకుల్ ప్రీత్ అందరికీ పాఠాలు చెబుతూ ఉంటుంది. అందరిలోనూ స్ఫూర్తి నింపుతూ ఉంటుంది. ఈ లాక్డౌన్ కాలంలో రకుల్ బాగానే వైరల్ అయింది. అన్నింటి కంటే ముఖ్యంగా రకుల్ పేరు డ్రగ్స్ కేసుల బయటకు రావడం కలకలం రేపింది. ఒక వైపు సినిమా షూటింగ్ మరో వైపు డ్రగ్స్ కేసుతో రకుల్ సతమతమైంది.

లాక్డౌన్‌లో అలా..
లాక్డౌన్‌లో రకుల్ తన కుటుంబ సభ్యులతో ఆటలు ఆడుకుంటూ టైం పాస్ చేసింది. సోదరుడితో కలిసి పులుసాట, కబడ్డీ, దిండుతో ఆటలు ఆడింది. అప్పట్లో ఆ వీడియోలు కూడా బాగా వైరల్ అయింది. ఇక మెడికల్ షాపు కోసం బయటకు వచ్చిన రకుల్‌ను ఫ్యాన్స్ వీడియోలు తీయడం కూడా ఫుల్ వైరల్ అయింది.

ఫ్యాన్స్‌తో ముచ్చట్లు..
రకుల్ ప్రీత్ లాక్డౌన్‌లో తన అభిమానులతో ముచ్చట్లు పెట్టింది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఖుషీ చేసింది. ఒక ప్రేమ గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ.. తానిప్పటివరకు ప్రేమలో పడలేదని, ప్రేమలో పడేందుకు ఎదురు చూస్తున్నానని వెరైటీగా చెప్పింది.

అటూ ఇటూ..
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో రకుల్ పేరు రావడం, అదే సమయంలో క్రిష్ సినిమాతో బిజీగా ఉండటంతో రకుల్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. డ్రగ్స్ కేసులో తనను అన్యాయంగా లాగుతున్నారని కోర్టుల చుట్టూ రకుల్ తిరిగింది. ఆ సమయంలో రకుల్ ఢిల్లీ హైద్రాబాద్ అంటూ అటూ ఇటూ తిరిగింది.

ప్రస్తుతం ఫుల్ హ్యాపీ..
రకుల్ ప్రస్తుతం ఫుల్ చిల్ అవుతోంది. ఫ్యామిలీతో కలిసి మాల్దీవుల్లో రచ్చ చేసింది. గతేడాది కూడా ఇలాగే బర్త్ డే వేడుకులను సెలెబ్రేట్ చేసుకునేందుకు మాల్దీవులకు వెళ్లారు. ఈ సారి కూడా అందుకే వెళ్లినట్టు కనిపిస్తోంది. ఇక మాల్దీవుల్లో బికినీ ధరించి రచ్చ రచ్చ చేస్తోంది.
Recommended Video

సినిమాలతో బిజీగా..
రకుల్ ప్రస్తుతం క్రిష్ సినిమాను పూర్తి చేసింది. నితిన్ చెక్ సినిమాతో బిజీగా ఉంది. తాజాగా అమితాబ్ అజయ్ దేవగణ్ చిత్రంలో చాన్స్ కొట్టేసింది. మేడే అంటూ రాబోతోన్న ఈ చిత్రంలో రకుల్ పైలెట్ పాత్రను పోషిస్తున్నట్టు తెలిపింది.


Click it and Unblock the Notifications











