తండ్రి చేతితో మసాజ్.. స్వర్గంలో తేలిపోతున్న రకుల్.. కూతురిపై ప్రేమను చాటుతున్న వీడియో
ఏ ఇంట్లో అయినా కూతుళ్లు మహారాణిలానే పెరుగుతారు. పైగా తండ్రికి కూతురుకు మధ్య ఉండే ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తండ్రికి కూతురు ఎప్పుడూ మహారాణిలానే కనిపిస్తుంది.. అలాగే పెంచుతారు కూడా. రకుల్ ప్రీత్‌ను కూడా ఆమె తండ్రి ఎంతో బాగా చూసుకుంటున్నాడు. వీకెండ్ సందర్భంగా రకుల్ ప్రీత్‌ను దగ్గర కూర్చోబెట్టుకుని తలకు మసాజ్ చేశాడు. ఈ మేరకు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ హల్చల్ చేస్తోంది. ఇంతకీ ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.

రకుల్ హల్చల్..
లాక్ డౌన్‌లో రకుల్ తెగ హల్చల్ చేస్తోంది. ఖాళీగా దొరికిన ఈ సమయాన్ని ఎంతో చక్కగా వినియోగించుకుంటోంది. వంటింట్లో దూరి కొత్త వంటకాలను ట్రై చేస్తోంది. సోదరుడితో కలిసి చిన్న పిల్లలా మారిపోయి ఆటలు ఆడుతోంది. రకుల్ ఇలా నిత్యం ఏదో ఒకటి చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

లాక్ డౌన్‌లో రచ్చ..
రకుల్ ప్రీత్ లాక్ డౌన్‌లో తెగ ఎంజాయ్ చేసింది. అందుకు సంబంధించిన వీడియోలు ఎన్నో మనం చూశాం. ఆ మధ్య సాధారణ యువతిలా బయటకు రావడం, ఆ వీడియో కాస్తా వైరల్ కావడం చూశాం. లాక్ డౌన్‌లోనూ హాట్ హాట్ ఫోటోలతో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చింది. ఈ మధ్య పెటాకు మద్దతుగా చేసిన ఫోటో షూట్ సైతం వైరల్ అయింది.

తల్లిదండ్రులతో క్లోజ్..
రకుల్ తన తల్లిదండ్రులతో ఎంత క్లోజ్‌గా ఉంటుందో ఆ మధ్య వివరించిన సంగతి తెలిసిందే. ఫ్యాషన్, సినీ రంగంలో వెళ్లేందుకు ప్రోత్సహించింది వారేనని చెప్పి, బికినీ ధరించడంలోనూ వారే సలహాలు ఇస్తుంటారని ఓ బాంబ్ పేల్చింది. వాటి సెలెక్షన్‌లో కూడా తన తండ్రే సలహాలు ఇస్తాడని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తాజాగా షేర్ చేసిన ఓ వీడియో తండ్రీ కూతుళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని చాటిచెబుతోంది.
Recommended Video

తండ్రి మసాజ్‌తో..
వీకెండ్‌ను రకుల్ ప్రీత్ ఎంతో సరదాగా గడుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇంట్లోనే ఉంటున్న రకుల్‌ను చంటి పాపలా చూసుకుంటున్నట్టు కనిపిస్తోంది. రకుల్ తండ్రి ఎంతో ప్రియమైన తన గారాల పట్టికి హెడ్ మసాజ్ చేస్తున్నాడు. ఓ వైపు మ్యూజిక్, మరో వైపు హెడ్ మసాజ్.. ఇక రకుల్ స్వర్గంలో తేలిపోయినట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











