ఆ పని చేయడానికి చచ్చిపోతున్నా.. అలాంటి మీడియా ఎప్పుడు వస్తుందంటూ రకుల్ సెటైర్స్
రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనపై వచ్చే రూమర్స్, వార్తలపై నిత్యం స్పందిస్తూ ఉంటుంది. తప్పుడు వార్తలు రాస్తే వెంటనే సెటైర్స్ వేస్తుంది. అది తప్పని అందరికీ తెలిసేలా చేస్తుంది.తాజాగా రకుల్‌పై తప్పుడు వార్త రాయడం, ఆ వార్త హీరోయిన్ కంట పడటం.. దానికి అదిరిపోయే ఓ కౌంటర్ వేయడం జరిగింది. అదేంటో ఓ సారి చూద్దాం.

రకుల్ హల్చల్..
కరోనా వల్ల దొరికిన ఈ హాలీడేస్‌లను రకుల్ బాగా ఎంజాయ్ చేస్తోంది. ఇంటి పట్టునే ఉంటూ తెగ సందడి చేస్తోంది. వంటింట్లో దూరి కొత్త వంటకాలను ట్రై చేస్తోంది. సోదరుడితో కలిసి చిన్న పిల్లలా మారిపోయి ఆటలు ఆడుతోంది. రకుల్ ఇలా నిత్యం ఏదో ఒకటి చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

మీడియాపై సెటైర్స్...
రకుల్ ప్రీత్ లాక్ డౌన్‌లో తెగ ఎంజాయ్ చేసింది. అందుకు సంబంధించిన వీడియోలు ఎన్నో మనం చూశాం. ఆ మధ్య సాధారణ యువతిలా బయటకు రావడం, ఆ వీడియో కాస్తా వైరల్ కావడం చూశాం. మద్యం కొనడానికే బయటకు వచ్చిందని ఓ మీడియా వార్తలు రాయడం, మెడికల్ షాపులో అవి కూడా అమ్ముతారా?అంటూ సదరు మీడియాకు సెటైర్ వేయడం అందరికీ తెలిసిందే.

తండ్రి మసాజ్‌తో..
తాజాగా రకుల్ ప్రీత్ షేర్ చేసిన వీడియో తెగ వైరల్ అయింది. తన తండ్రి చేత హెడ్ మసాజ్ చేయించుకున్న వీడియోను షేర్ చేస్తూ.. తండ్రీకూతుళ్లు ప్రేమను నెటిజన్లకు పరిచయం చేసింది. తాజాగా రకుల్ మళ్లీ వార్తల్లో నిలిచింది. తనపై రూమర్స్ క్రియేట్ చేసిన మీడియాపై సెటైర్స్ వేసింది.

షూటింగ్‌లకు రానని..
రకుల్ ప్రీత్ తనపై మీడియా రాసే వార్తలకు ఎలాంటి కౌంటర్ ఇస్తుందో అందరికీ తెలిసిందే. తాజాగా మరో వార్తపై రకుల్ ఫైర్ అయింది. తాను షూటింగ్‌లకు హాజరుకానని చెబుతోందని, ఆ కారణంగా కొన్నిసినిమాలను చేజార్చుకుంటోందని ఓ వెబ్‌సైట్ కథనం అల్లింది.

ఆ పని చేయడనాకి చచ్చిపోతున్నా..
అలా తనపై అల్లిన కథపై, సదరు మీడియాపై, జర్నలిజంపైనా రకుల్ సెటైర్స్ వేసింది. ‘మనం ఎప్పడు బాధ్యతతో కూడుకున్న జర్నలిజాన్ని చూస్తాం.. తాను రాసే వార్తలను మీడియా ఎప్పుడు నిజనిర్దారణ చేసుకుంటుంది?.. కొన్ని హిట్ల కోసం ఇలా రాయడం ఆపండి.. షూటింగ్‌లు ఎవరు ఎక్కడ ప్రారంభించారో కాస్త చెప్పండి.. పని చేయడం కోసం ఇక్కడ చచ్చిపోతున్నా'నని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











