చేసుకోబోయే వాడికి ముఖ్యంగా అది ఉండాలి.. డ్రీమ్ బాయ్‌పై రకుల్ సెన్సేషనల్ కామెంట్స్
రకుల్ ప్రీత్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి కామెంట్ చేసింది. ఆమె తల్లి కూడా ఆ ఇంటర్వ్యూలో రకుల్ పెళ్లి గురించి కామెంట్స్ చేసింది. అయితే తాజాగా రకుల్ మాత్రం తనకు కాబోయే వాడు ఎలా ఉండాలి? ఎలాంటి లక్షణాలు ఉండాలి? అనే సీక్రెట్స్‌ను చెప్పేసింది. ఆ లక్షణాలు ఏంటో? మరి ఆ లక్కీ బాయ్ ఎలా ఉండాలని అనుకుంటుందో ఓ సారి చూద్దాం.

పెళ్లిపై విసిగి..
రకుల్‌కు ఎలాంటి వాడిని చూసినా నచ్చడం లేదని ఆమె తల్లి రినీ సింగ్ వాపోయింది. అందుకే ఇక మా వల్ల కాదని తనతో చెప్పామని తననే ఓ అబ్బాయిని చూసుకోమ్మని చెప్పినట్టు తెలిపింది. ఇక రకుల్ సైతం అందుకు ఆసక్తిగానే ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రేమపై అభిప్రాయం..
ప్రస్తుతం తానో వ్యక్తిగా ఎంతో మార్పు చెందానని తెలిపింది. తల్లిదండ్రుల ద్వారా ప్రేమంటే ఏంటో తెలిసిందని చెప్పుకొచ్చింది. ప్రేమ, వివాహా బంధాలను నమ్ముతానని పేర్కొంది. అవి ఎంతో అందంగా కూడా ఉంటాయని వెల్లడించింది. వీటిని ఒత్తిడిలా ఎందుకు భావిస్తారో తనకు అర్థం కాదని తెలిపింది. ఎవరైనా ప్రేమిస్తే మనస్ఫూర్తిగా ప్రేమించాలని, తాను మాత్రం అలానే చేస్తానని చెప్పుకొచ్చింది.

అది కచ్చితంగా ఉండాలి..
కాబోయే వరుడు గురించి రకుల్ చెప్పుకొచ్చింది. అతనికి కొన్ని లక్షణాలు ఉండాలని కూడా పేర్కొంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అతడ్ని చూసుకునేలా ఉండాలి, మరీ ముఖ్యంగా తెలివి కచ్చితంగా ఉండాలి. అంతేకాకుండా అతని జీవితానికంటూ ఓ అర్థం ఉండాలని తెలిపింది.
Recommended Video

చిన్నతనంలో అలా..
తాను ఇప్పటికీ ఇలా ఒంటరిగా ఉండటానికి కారణం తన తమ్ముడేనని తెలిపింది. చిన్నతనంలో ఎవరైనా అబ్బాయిలతో మాట్లాడితే ఇంట్లోవచ్చి చెప్పేవాడని పేర్కొంది. ఓ సారి తాను లంచ్ టైమ్‌లో తినేటప్పుడు ఇద్దరు అమ్మాయిలు, ఓ అబ్బాయి పక్కన కూర్చున్నానని, అయితే తాను అతడికి తినిపిస్తున్నానని తన తమ్ముడు ఇంట్లో చాడీలు చెప్పాడని తెలిపింది.


Click it and Unblock the Notifications











