వరల్డ్ హెల్త్ డే.. రకుల్ ప్రీత్ టిప్స్.. ఫాలో అయితే 100 ఏళ్ల ఆరోగ్యం పక్కా

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ న్యూఢిల్లీకి చెందిన అమ్మాయి అయినప్పటికి దక్షిణాదిలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తొలిసారి ముద్దుగుమ్మకు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలోనే హీరోయిన్గా అవకాశం అందింది. 7/G బృందావనం కాలనీ సినిమాను 2009లో కన్నడ భాషలో రీమేక్ చేయగా అందులో హీరోయిన్గా తొలిసారి అవకాశం దక్కించుకుంది. గిలి అనే టైటిల్ తో రిలీజ్ అయింది. ఆ తర్వాత టాలీవుడ్ లోకి కెరటం అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చిత్రంతో మంచి హిట్ అందుకుంది.

సందీప్ విషయం సరసన నటించిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చిత్రం మాత్రం రకుల్ ప్రీత్ సింగ్కు మంచి మైలేజ్ గా మారింది. తన అందం స్లిమ్ ఫిట్ బాడీ ఇలా హీరోయిన్ కి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ ని కనబరిచి టాలీవుడ్ లో అప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబు, మాస్ మహారాజ్ రవితేజ వంటి హీరోలతో వెండితెరపై అలరించింది. స్టార్ హీరోలకు దీటుగా నటించి తన టాలెంట్ ను రుజువు చేసుకుంది.

Rakul Preet Singh s health tips on World Health Day

రకుల్ ప్రీత్ సింగ్ కూడా దక్షిణాదిలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గానే కనిపిస్తూ ఉంటారు. తన గురించిన ప్రత్యేకమైన విషయాలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు ప్రత్యేకమైన రోజుల్లో మాత్రం స్పెషల్ పోస్టులు చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను షేర్ చేసుకుంది.

ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. అందుకని కొన్ని ప్రత్యేకమైన అభ్యాసాల ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందే అవకాశం ఉంది. కొన్ని విషయాలను మీతో పంచుకుంటున్నాను. ప్రతిరోజు మీకు నచ్చిన ఆహారాన్ని మోతాదులో తీసుకోండి. ప్రతిరోజు పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి, దాని ద్వారా ప్రశాంతత లభిస్తుంది. ఎప్పుడు ప్రకృతికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించండి. అప్పుడు మనసు ఎంతో తేలికగా ఉంటుంది. వీలైతే ఏదైనా ఒక క్రీడను ఎంచుకునే ఆడుతూ ఉండండి. నేను మాత్రం గోల్ఫ్ ఆడుతాను. తద్వారా మన శరీరం యాక్టివ్ గా ఉంటుంది.

ఇక శరీర ఆత్మ సమతుల్యత కోసం ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. రోజుకు 5 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల జీవితంలో ఊహించలేని పెద్ద మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇక ఎప్పుడు సరదాగా నవ్వుతూ ఉండడానికి ప్రయత్నించండి. సంతోషమే జీవితానికి బెస్ట్ మెడిసిన్ గా పనిచేస్తుంది. ఇక చిన్న అడుగులతో ప్రారంభించి, మీ లక్ష్యాల వైపు వెళ్ళండి. మీరు ఒక్కచోట మాత్రమే నివసిస్తున్నారని మాత్రం గుర్తుంచుకోండి. అది కూడా మీ శరీరంలో మాత్రమే... అని చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. దాంతోపాటు తన వర్కౌట్, మెడిటేషన్, హెల్తి ఫుడ్, ఇతర ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని తను రోజువారీగా చేసే పనులను తెలియజేసింది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ తరుచుగా జిమ్ లోనే కనిపిస్తూ ఉంటుంది. ఆమెకు రెండు జిమ్ సెంటర్లు కూడా ఉండటం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X