గుడ్ న్యూస్ చెప్పిన రామ్ చరణ్ వైఫ్ ఉపాసన
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల్లో నటిస్తూ, తన ప్రొడక్షన్ బాధ్యతలు చూసుకుంటూ బిజీ బిజీగా గడుపుతారు, ఆయన భార్య ఉపాసన అపోలో హాస్పిటల్ వ్యవహారాల్లో తీరిక లేకుండా గడుపుతుంటారు. అలసి పోయి ఇంటికి వచ్చిన ఇద్దరూ తమ పెంపుడు జంతువులతో గడుపుతూ రిలాక్స్ అవుతుంటారు.
ఈ ఇద్దరికీ మూగజీవాలంటే కేవలం ఇష్టం మాత్రమే కాదు వాటిని ప్రాణంగా చూసుకుంటారు. కుక్క, పిల్లి, నెమళి, కోడి, గుర్రం ఇలా చాలా రకాల జంతువులను ఈ జంట పెంచుకుంటున్నారు. ఒక ఒంటెపిల్ల కూడా ఉన్నట్లు సమాచారం.

తాజాగా వీరు పెంచుకుంటున్న ఓ గుర్రం ప్రసవించింది. ఆడ పిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఉపాసన తన ట్విట్టర్ ద్వారా ప్రకటించిన మురిసిపోయారు. త్వరలో దీనికి పేరు పెట్టాలనుకుంటున్నాం, మీరేమైనా సలహాలు ఇవ్వండి అంటూ అభిమానులను కోరింది.
మెగా ఫ్యామిలీలోకి అడుగు పెట్టిన తర్వాత ఉపాసన చాలా మారిపోయారు. ఇటు కోడలిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే... తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అటు అపోలో బాధ్యతలు చూసుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, సేవా కార్యక్రమాలు చేస్తూ, పలు అంశాలపై సోషల్ అవేర్‌నెస్ తెస్తూ దూసుకెళుతున్నారు.


Click it and Unblock the Notifications











