మెగా అభిమానులకు కనువిందు.. అన్నదమ్ములు కలిసి ఇలా!
మెగా బ్రదర్స్ ఇద్దరు ఒకే ఫ్రేమ్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. సరదాగా సెల్ఫీ దిగి మెగా అభిమానులకు కనువిందు చేశారు. ఓ స్టార్ హోటల్‌లో లంచ్‌కి వెళ్లిన రామ్ చరణ్, వరుణ్ తేజ్ సెల్ఫీతో సర్‌ప్రైజ్ చేశారు. ప్రస్తుతం తమ తమ సినిమాలతో బిజీగా ఉన్న ఈ ఇద్దరు మెగా బ్రదర్స్ ఇలా ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అది చూసి ఖుషీ అవుతున్నారు మెగా అభిమానులు. రాఖీ పండుగ సందర్బంగా ఎంజాయ్ చేస్తూ ఇలా సెల్ఫీ దిగారు చెర్రీ, వరుణ్. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.
మరోవైపు వరుణ్ తేజ్ వాల్మీకి సినిమాతో బిజీగా ఉంటే.. రామ్ చరణ్ సైరా నరసింహా రెడ్డి నిర్మాణ పనులతో పాటు RRR షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నారు. వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్మీకి సినిమా ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసుకొని సెప్టెంబర్ 13 వ తేదీన విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించాయి. చిత్రంలో వరుణ్ డిఫెరెంట్ రోల్‌లో కనిపించనున్నాడు.

ఇక రామ్ చరణ్ విషయానికొస్తే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు 'సైరా నరసింహా రెడ్డి' పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగమవుతున్నారు. అక్టోబర్ 2న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానున్న ఈ సినిమా టీజర్ చిరు పుట్టినరోజు సందర్బంగా ఆగస్టు 20న విడుదల చేయనున్నారు. మరోవైపు తాను హీరోగా నటిస్తున్న RRR షూటింగ్‌లో పాల్గొంటున్నారు రామ్ చరణ్. రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో చెర్రీతో పాటు మరో హీరోగా ఎన్టీఆర్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది జులై 30 వ తేదీన RRR విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











