Happy Birthday Ram Charan: విమర్శలు చేసిన వారికి చెంపపెట్టు సమాధానం.. ఎన్ని కోట్లకు వారసుడో తెలుసా!
మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ తేజ్ ఒక విధంగా మొదటి మెట్టు నుంచి ఎక్కుతూ ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. మెగా పవర్ స్టార్ సినిమా అంటే ఇప్పుడు వందల కోట్ల డిమాండ్ అయితే పెరుగుతోంది. ఫ్యాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు అందుకున్న రామ్ చరణ్ తేజ్ నేడు 38వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఇక ఎంతో ప్రత్యేకమైన ఈ పుట్టినరోజును చరణ్ కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఇక మెగా బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా ఎంతో హార్డ్ వర్క్ చేసి ఇంతవరకు వచ్చిన చరణ్ విమర్శలు చేసిన వారికి కూడా సైలెంట్ గా ఒక చెంపపెట్టు సమాధానం ఇచ్చాడు అని చెప్పవచ్చు. ఇక రామ్ చరణ్ ఎన్ని కోట్లకు వారసుడు? అనే వివరాల్లోకి వెళ్తే..

తండ్రికి తగ్గ తనయుడిగా..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తండ్రికి తగ్గ తనయుడిగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. కేవలం సినిమాలతోనే కాకుండా అనేక రకాల సామాజిక అంశాలలో కూడా అతను పాలుపంచుకుంటున్నాడు. చిరంజీవి సేవ కార్యక్రమాలను ఎంతో బాధ్యతాయుతంగా కొనసాగిస్తూ పదిమందికి అండగా నిలుస్తున్నాడు. ఆ రూట్లో కూడా అతను పవన్ కళ్యాణ్ తరహాలోనే క్రేజ్ అందుకుంటున్నాడు.

చెంపపెట్టు సమాధానం
అయితే రామ్ చరణ్ తేజ్ మొదటి సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పుడు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. కానీ కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేసిన విధానం అప్పట్లో అందరికీ ఆగ్రహానికి తెప్పించింది. కానీ రామ్ చరణ్ తేజ్ విమర్శలను పట్టించుకోకుండా కేవలం తన హార్డ్ వర్క్ పై ఫోకస్ చేసి నటుడిగా తనను తాను నిరూపించుకుంటూ వచ్చాడు. ఇక రంగస్థలం సినిమాలో అతను విమర్శలు చేసిన అందరికీ కూడా తన యాక్టింగ్ స్కిల్స్ తోనే ఒక చెంపపెట్టు సమాధానం ఇచ్చాడు.

అన్ని రకాల సినిమాలు
రామ్ చరణ్ తేజ్ ఇప్పటివరకు చేసింది 14 సినిమాలే అయినప్పటికీ కూడా ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక కొత్త తరహా కంటెంట్ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడు. అలాగే అన్ని రకాల సినిమాలు చేసి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కామెడీ యాక్షన్ త్రిల్లర్ అలాగే పిరియాడిక్ ఇలా వివిధ రకాల జానర్స్ ను రామ్ చరణ్ తేజ్ టచ్ చేసే ప్రయత్నం చేశాడు.

ఆస్కార్ వరకు
ఇక RRR సినిమాతో రామ్ చరణ్ తేజ్ ఏ స్థాయిలో గుర్తింపును అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పినవసరం లేదు. తన ప్రాణమిత్రుడు జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించి ఆస్కార్ వరకు ఆ సినిమాను తీసుకువెళ్లారు. నాటు నాటు బాటలో రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన డ్యాన్స్ తో ఎంతోమందిని ఆకట్టుకున్నారు. ఆ పాటకు ఆస్కార్ అవార్డు దక్కడంతో రామ్ చరణ్ తేజ్ రేంజ్ మరింత పెరిగిపోయింది.

ఆస్తుల విలువ
ఇక రామ్ చరణ్ తేజ్ కేవలం తండ్రి ఆస్తిపై కాకుండా చాలావరకు తనే సొంతంగా సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే కొన్ని బిజినెస్ లలో కూడా చరణ్ పెట్టుబడులు పెట్టాడు. ఇక ఇప్పటివరకు అతని ఆస్తుల విలువ 1500 కోట్లకు పైగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏడాదికి రామ్ చరణ్ 200 కోట్లకుపైగా ఆదాయాన్ని అందుకుంటున్నాడు. రామ్ చరణ్ తేజ్ ఒక్కో సినిమాకు 50 నుంచి 60 కోట్ల వరకు పారితోషికం అయితే అందుకుంటున్నాడు.

బిగ్ బడ్జెట్ సినిమాలు
ఇక రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం బిగ్ బడ్జెట్ సినిమాలను లైన్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ తన 16వ సినిమాను చేయనున్నాడు. అలాగే మరి కొంతమంది బడా దర్శకుల తో కూడా రామ్ చరణ్ తేజ్ సినిమాలను సెట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు.


Click it and Unblock the Notifications











