ఎన్టీఆర్ తనయుడి కోసం బర్త్ గిఫ్ట్ పంపిన రామ్ చరణ్
Recommended Video

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గిఫ్ట్ పంపారట. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ రామ్ చరణ్ పోస్టు చేసిన వీడియో వైరల్ అయింది. హాయ్ అభయ్.. విష్ యూ ఎ వెరీ వెరీ హ్యాపీ బర్త్ డే. నీకొక మంచి గిఫ్ట్ పంపాను. మీ నాన్నను అడుగి తీసుకో. ఆ గిఫ్ట్ నీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎంజాయ్ యువర్ బర్త్ డే అంటూ రామ్ చరణ్ విష్ చేశాడు.
రామ్ చరణ్ విషెస్
ఇంతకీ రామ్ చరణ్ పంపిన గిఫ్ట్ ఏమిటి? అనేది చర్చనీయాంశం అయింది. టాలీవుడ్ టాప్ హీరోలైన మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య మంచి స్నేహబంధం ఉంది. వీరి ఫ్యామిలీస్ కూడా తరచూ కలిసి సరదాగా గడుపుతుంటారు. ఆ ఎఫెక్షన్‌తోనే రామ్ చరణ్ ఇటీవల సితార బర్త్ డే సందర్భంగా కూడా విషెస్ తెలిజయేశారు.
కొడుకుతో ఎన్టీఆర్
అభయ్ రామ్ బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఇలా.....

రామ్ చరణ్-ఎన్టీఆర్
ఇక సినిమాల విషయానికొస్తే రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి త్వరలో రాజమౌళి దర్శకత్వంలో #ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేయబోతున్నారు. తెలుగు సినిమా చరిత్రలో బాహుబలి తర్వాత భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోయే సినిమా ఇదే అని టాక్. డిసెంబర్ నుండి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.

ఎవరి ఊహకు అందని స్థాయిలో రాజమౌళి ప్లానింగ్
తను తీయబోయే #ఆర్ఆర్ఆర్ మూవీని సాధారణ ప్రేక్షకుల ఊహకు అందని స్థాయిలో రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి రూ. 300 కోట్ల బడ్జెట్ ఖర్చు చేయబోతున్నారు. అసలే రాజమౌళి, ఈ స్థాయి బడ్జెట్ అంటే సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవడం కష్టమే.


Click it and Unblock the Notifications











