‘చిరుత’కు పదమూడేళ్లు.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమై పదమూడేళ్లు కావోస్తోంది. రామ్ చరణ్ చిరుతతో రికార్డులు కొట్టడం ప్రారంభించి రేపటికి (సెప్టెంబర్ 28) పదమూడేళ్లు నిండుతాయి. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ చేసేందుకు రెడీ అయ్యారు. నేటి సాయంత్రం ఆరు గంటలకు 13YearsForRamCharanInTFI అనే హ్యాష్ ట్యాగ్‌తో రికార్డులు క్రియేట్ చేయాలని ట్వీట్ల యుద్దాన్ని ప్రకటించారు. ఈ మేరకు ఫ్యాన్స్ అందరూ ట్వీట్లు చేసే పనిలో పడ్డారు.
చిరు తనయుడు చిరుతగా బాక్సాఫీస్‌పై విరుచుకుపడ్డాడు. మొదటి సినిమానే అయినా కూడా ఏ సీన్‌లోనూ అలా అనిపించదు. యాక్షన్ సీన్స్, ఎమోషన్, డ్యాన్సులు ఇలా ప్రతీ విషయంలో రామ్ చరణ్ నిరూపించుకున్నాడు. మొదటి సినిమాతో రామ్ చరణ్ తన సత్తాను చాటుకున్నాడు. ఇక అక్కడి నుంచి బాక్సాఫీస్ మీద దాడి చేస్తూనే ఉన్నాడు. రెండో చిత్రంతోనే ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టేశాడు. మగధీర చిత్రంతో టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా ఎదిగాడు.

ఇక వరుసగా.. ఆరెంజ్, రచ్చ, నాయక్, ఎవడు, గోవిందుడు అందరివాడేలే, బ్రూస్‌లీ, ధృవ, రంగస్థలం ఇలా ఒక్కో చిత్రంతో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాడు. రంగస్థలం చిత్రంతో మరో సారి ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టేశాడు. ఇక చివరగా వినయ విధేయ రామ చిత్రంతో అందర్నీ పలకరించాడు. కానీ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఇలా బాక్సాఫీస్ వద్ద రామ్ చరణ్ యుద్దం చేస్తూ ఉండగా.. ప్రస్తుతం చెర్రీ ఫ్యాన్స్ ట్విట్టర్‌లో రికార్డులు క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యారు. రేపటికి మరి ఎన్ని మిలియన్ల ట్వీట్లు చేస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











