ఎన్టీఆర్ ఫ్యాన్స్ తర్వాత.. రాంచరణ్ ఫ్యాన్స్ రచ్చకు రెడీ.. 24 గంటలపాటు..

సినీ హీరోల ఫ్యాన్స్ తమ అభిమాన నటుడి సత్తాను నిరూపించుకొనేందుకు సోషల్ మీడియాను ఆసరాగా తీసుకొంటున్నారు. ఏదో ఒక చిన్న సందర్భాన్ని తీసుకొని తమ నటుడి గురించి ట్వీట్లతో ట్రెండ్స్ సృష్టించి రికార్డులు రాసుకొంటున్నారు. ఇటీవల కాలంలో ఈ ట్రెండ్ చాలా ఎక్కువగా ట్విట్టర్‌లో కనిపిస్తున్నది. తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో రాంచరణ్ ఫ్యాన్స్ తమ సత్తాను చాటేందుకు శనివారం (జూన్ 6) సాయంత్రాన్ని ఉపయోగించుకోబోతున్నారు. అసలు ఎందుకు ట్రెండ్ చేస్తున్నారంటే..

స్వీయ గృహ నిర్బంధంలో

స్వీయ గృహ నిర్బంధంలో

గత కొద్దికాలంగా రాంచరణ్ గురించి ప్రస్తావించడానికి వార్తలకు చోటు లేకపోయింది. లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో షూటింగులు, ఇతర కార్యక్రమాలను దూరంగా ఉంటూ స్వీయ గృహ నిర్బంధంలో ఉంటున్నారు. అయితే తన అభిమానులు 24 గంటలపాటు తన పేరుతో ట్రెండ్ చేయడానికి సిద్ధమయ్యారు.

 జూన్ 6వ తేదిన

జూన్ 6వ తేదిన

రాంచరణ్ ఫ్యాన్స్‌ను ట్విట్టర్ ట్రెండ్‌కు రెడీ కావాలని పిలుపునిచ్చాం. జూన్ 6వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి జూన్ 7వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ట్రెండ్ చేయాలని డిసైడ్ చేశాం. త్వరలోనే ట్యాగ్, కామన్ డీపీ రిలీజ్ చేస్తాం అని ట్రెండ్స్ రామ్‌చరణ్ ట్వీట్ చేసింది.

24 గంటలపాటు

24 గంటలపాటు

చాలాకాలంగా రామ్‌చరణ్ ట్రెండింగ్‌ లేరు. కాబట్టి మనమంతా మాస్‌గా 24 గంటలపాటు నాన్ స్టాప్‌గా స్పెషల్ ట్యాగ్‌తో మన హీరో @AlwaysRamCharan హ్యాష్ ట్యాగ్, #SeethaRAMaRajuCHARAN
@TrendsRamCharan ట్యాగ్స్‌తో ట్రెండ్ చేసి రచ్చ చేద్దాం అంటూ ఫ్యాన్స్‌కు పిలుపునిచ్చారు.

 ఎన్టీఆర్ ఫ్యాన్స్ వివాదం కొనసాగుతుండగానే

ఎన్టీఆర్ ఫ్యాన్స్ వివాదం కొనసాగుతుండగానే

తాజాగా ట్విట్టర్‌లో సినీ హీరోల ఫ్యాన్స్ వ్యవహారం చర్చనీయాంశమవుతున్నది. పలు హీరోల అభిమానులు దూకుడుగా ప్రవర్తిస్తూ ఎదుటి హీరోల ఫ్యాన్స్‌ను చెండాడటం వివాదంగా మారుతున్నది. తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వ్యవహారమే అందుకు సాక్ష్యం. ఒకవేళ ఈ ట్రెండింగ్ వ్యవహారం సానుకూలంగా, పద్ధతిగా ఉంటే హీరోలకు మంచి పేరు తేవడం ఖాయం. ఒకవేళ అభిమానులు హద్దు మీరి దారితప్పితే అందుకు మూల్యం చెల్లించాల్సిందే అంటున్నాయి సినీ వర్గాలు.

Recommended Video

Ram Gopal Varma Planning To Come Up With 'Deyyam' Movie Sequel
రాంచరణ్ కెరీర్ విషయానికి వస్తే..

రాంచరణ్ కెరీర్ విషయానికి వస్తే..

రాంచరణ్ విషయానికి వస్తే.. రాజమౌళి రూపొందిస్తున్న RRR చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా ఓ విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడింది. ఇక లాక్‌డౌన్‌లో నిబంధనలు సడలించడంతో భారీ సెట్ వేసి ఈ సినిమా షూటింగును పూర్తిచేయాలని భావిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా డేట్‌ను ప్రకటించే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X