For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘మగధీర’కు పదకొండేళ్లు.. ఆ చరిత్ర తెర వెనుక జరిగిన సంఘటనలెన్నో!

  |

  మగధీర చిత్రానికి తెలుగు చిత్రసీమలో ప్రత్యేక స్థానం. సినీ పరిశ్రమను మగధీరకు ముందు, తరువాత అని లైన్ గీసి మరీ చెప్పేంత స్థాయి ఉన్న చిత్రం. బాహుబలి చిత్రం వచ్చిందంటే దానికి కారణం మగధీర ఇచ్చిన నమ్మకం. మగధీర సృష్టించిన ప్రభంజనమే అందరికీ ఓ నమ్మకాన్ని కలిగించింది. కథ, దర్శకుడిపై నమ్మకం ఉంటే ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టొచ్చని మగధీర నిరూపించింది. జక్కన్న రాజమౌళి విజన్‌కు నిర్మాత అల్లు అరవింద్ అండ దొరికింది. అందుకే మగధీర ఓ చరిత్ర అయింది. నేటికి ఈ సినిమా విడుదలై 11 ఏళ్లు అవుతోంది.

  #Magadheera : SS Rajamouli మ్యాజిక్, మగధీర Facts, బాహుబలి వచ్చిందంటే మగధీర వల్లే || Oneindia Telugu
  మగధీరలో విశేషాలెన్నో..

  మగధీరలో విశేషాలెన్నో..

  మగధీర సినిమాలో బయటకు తెలియన ఎన్నో విశేషాలున్నాయి. మొదటగా ఈ చిత్రానికి ధీరుడు అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. కానీ చివరకు మగధీరగా ఫిక్స్ అయింది. టాలీవుడ్‌లో ఎప్పటికీ అలా నిలిచిపోయింది. బాక్సాఫీస్ రికార్డులు, వంద, రెండొందలు రోజులు ఆడిన సెంటర్లెన్నో ఉన్నాయి. వందరోజుల పాటు హౌజ్ ఫుల్ బోర్డులతో దూసుకెళ్లిన మగధీర 223 సెంటర్లలో శతదినోత్సవం జరుపుకుంది.

  అలా మొదలు..

  అలా మొదలు..

  మగధీరకు పూర్వం దాదాపు పదిహేనేళ్ళ క్రితం తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పిన రాజమాత, ఆమెను నిత్యం కాపాడే ఓ బాడీ గార్డ్ కథ రాజమౌళి మైండ్‌లో అలా గుర్తుండిపోయిందట. ఓ సందర్భంలో విజయేంద్ర ప్రసాద్ ఒక సినిమా కోసం రెడీ చేసి రిజెక్ట్ అయిన ఆ కథను ఎప్పటికైనా తాను తీయాలని డిసైడ్ అయ్యాడట రాజమౌళి. అదే మగధీరగా రూపుదాల్చింది.

  గాయాల పాలు...

  గాయాల పాలు...

  అప్పటికి మగధీర నిర్మాణ దృష్ట్యా అత్యంత భారీ చిత్రం. అందులోని యాక్షన్ సీక్వెన్స్‌కు మరింత ప్రత్యేకత ఉంది. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్‌కు గాయాలయ్యాయి. బైక్ స్టంట్ చేస్తూ గాయపడ్డాడు. మళ్ళీ నెలకే కోలుకొని సెట్ లో అడుగుపెట్టాడట. వాటర్ ఫాల్స్ నుండి గుర్రంతో జంప్ చేసే సన్నివేశంలో హీరోకు కూడా గాయమైందట.

  అలా ఆ పాట..

  అలా ఆ పాట..

  మగధీర సినిమాలో పాటలన్నీ ఒకెత్తు అయితే.. రీమిక్స్ సాంగ్ మరో ఎత్తు. ఘరానా మొగుడు సినిమాలోని బంగారు కోడి పెట్ట సాంగ్‌ను రీమేక్ చేయగా చిరంజీవిని మైమరిపించేలా రామ్ చరణ్ డ్యాన్సులతో ఇరగ్గొట్టేశాడు. అయితే ఈ పాటను రీమేక్ చేయాలన్న ఐడియా మాత్రం కీరవాణి భార్య వల్లి గారిదట. ఆమె తన ఆలోచన బయట పెట్టగానే రాజమౌళి పచ్చ జెండా ఊపేశారట.

  చివరి నిమిషంలోనూ..

  చివరి నిమిషంలోనూ..

  గజినీ సినిమాను హిందీలో రీమేక్ చేయగా వచ్చిన లాభాలన్నీ మగధీరలో పెట్టానని అల్లు అరవింద్ చెప్పాడు. సినిమాకు అనుకున్న బడ్జెట్ దాటినా విజువల్ ఎఫెక్ట్స్ కోసం మళ్ళీ సపరేట్ బడ్జెట్ కేటాయించి ఫైనల్‌గా బెస్ట్ అవుట్ పుట్ వచ్చేలా చూసారు నిర్మాత అల్లు అరవింద్. ఇక రిలీజ్ కి రెండ్రోజుల ముందు కాంప్రమైజ్ అవ్వకుండా గ్రాఫిక్స్ షాట్స్ లోనూ మార్పులు చేశాడట మన జక్కన్న. ఇలా చరిత్రలో నిలిచిపోయే చిత్రం కోసం చివరి నిమిషం వరకు కష్టపడ్డారట.

  ఇప్పటికీ రికార్డులే..

  ఇప్పటికీ రికార్డులే..

  తెలుగు చిత్ర సీమలో అరవై కోట్లు కొల్లగొట్టిన మొదటి చిత్రమిదే. ఇప్పటికీ ఈ రికార్డులను కొట్టేందుకు చాలా మంది హీరోలు ప్రయత్నిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని లక్ష్మీ వెంకటేశ్వర థియేటర్లో ఏకంగా వెయ్యి రోజులు ఆడింది. ఇది కూడా ఓ రికార్డే. ఇక నేడు ఈ ఇండస్ట్రీ హిట్‌కు పదకొండేళ్లు అవుతుండటంతో సోషల్ మీడియాలో 11YearsForIHMagadheera అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.

  రామ్ చరణ్ ఎమోషనల్..

  రామ్ చరణ్ ఎమోషనల్..

  మగధీర చిత్రానికి పదకొండేళ్లు అవుతుండటంతో రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ‘నన్ను పరీక్షించిన చిత్రం, నాకు మార్గనిర్దేశకం చేసిన చిత్రం, ఈ సినిమా ద్వారా ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. మగధీర చిత్ర యూనిట్, ప్రేక్షకులు కురిపించిన అభిమానానికి ధన్యవాదాలు. నా హద్దులను చేరిపేసి, కష్టే ఫలి అనే సూత్రాన్ని చెప్పిన రాజమౌళి గారికి థ్యాంక్స్' అని ట్వీట్ చేశాడు.

  English summary
  11YearsForIHMagadheera, Ram Charan MagaDheera Completes 11 Years. A memorable experience that mentored me & put every skill of mine to test. I’m humbled by the love & affection shown by the entire team of #Magadheera & the audience. ssrajamouli garu, you motivate me to push my limits & remind me that hard work always pays off.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X