వైరల్ వీడియో : వెన్న చేయడం నేర్చుకుంటోన్న చెర్రీ.. కృష్ణుడిలా ఉన్నావ్ అంటూ మురిసిపోతోన్న అంజనాదేవీ

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది మరణించారు. మన దేశంలోనూ కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ముప్పై వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా వెయ్యికి పైగా మరణాలు సంభవించాయి. కరోనా కట్టడికి గత నెల రోజుల నుంచి లాక్ డౌన్‌ను పాటిస్తున్నాం. ఈ మేరకు ప్రజలంతా ఇంటి పట్టునే ఉంటూ కరోనాపై పోరాటంలో తమ వంతు పాత్రను పోషిస్తున్నారు.

Recommended Video

Watch : Ram Charan Learning To Make Butter With His Grandmother
అందరూ ఇంటి పట్టునే..

అందరూ ఇంటి పట్టునే..

లాక్ డౌన్‌ను విధించడంతో ప్రజలంతా ఇంటి పట్టునే ఉంటున్నారు. క్షణ కాలం తీరిక లేకుండా బిజీగా గడిపే స్టార్స్ అంతా ప్రస్తుతం ఇంటి గడప దాటడం లేదు. ఇంట్లోనూ ఉంటూ తమ నైపుణ్యాలకు పదునుపెడుతున్నారు. కొందరు వంటింట్లో చేరి కొత్త వంటకాలను నేర్చుకుంటూ ఉండగా.. మరి కొందరు పెయింటింగ్, డ్రాయింగ్, వ్యాయామాలు, జిమ్ అంటూ బిజీగా గడిపేస్తున్నారు.

మెగా సందడి..

మెగా సందడి..

లాక్ డౌన్ వేళ సోషల్ మీడియాలో మెగా సందడి ఎక్కువైంది. చిరంజీవి, రామ్ చరణ్ ట్విట్టర్‌లోకి ఎంటర్ అవ్వడంతో మరింత హంగామ మొదలైంది. చిరు చేసే ట్వీట్స్, వేసే పంచ్‌లు, సెటైర్స్ ఎంతగా వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే చిరు రేంజ్‌ దూకుడును రామ్ చరణ్ ప్రదర్శించలేకపోతోన్నాడు.

అంతగా యాక్టివ్‌గా ఉండని చరణ్..

రామ్ చరణ్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండడు. అవసరం మేరకు ట్వీట్స్ చేస్తూ ఉంటాడు. ఈ మధ్య రియల్ మెన్ ఛాలెంజ్, ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ మరణాలపై స్పందించాడు. తాజాగా చెర్రీ షేర్ చేసిన ఓ వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది.

వెన్న చిలుకుతున్న చెర్రీ..

వెన్న చిలుకుతున్న చెర్రీ..

రామ్ చరణ్ వంటింట్లో దుమ్ములేపుతాడన్న సంగతి తెలిసిందే. చెర్రీ చెయ్యి తిరిగిన వంటగాడని ఇది వరకు షేర్ చేసిన వీడియోలు చూస్తేనే తెలుస్తోంది. అయితే తాజాగా నానమ్మ సారథ్యంలో వెన్నె చేయడం నేర్చుకుంటున్నాడు చెర్రీ. కవ్వం పట్టి వెన్నెను చిలుకుతూ ఉంటే.. కృష్టుడిలా ఉన్నావ్ అంటూ నానమ్మ మురిసిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X