For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇంట్రెస్టింగ్: తెలుగు ప్రభుత్వాలు అలా చేసుంటే.. ‘సైరా: నరసింహారెడ్డి’ ఫలితం మరోలా ఉండేదట.!

  By Manoj
  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమాల్లో 'సైరా: నరసింహారెడ్డి' ఒకటి. మెగాస్టార్ చిరంజీవి దీనికి హీరో కావడం.. రాయలసీమకు చెందిన స్వాతంత్ర సమరయోధుడి కథ కావడం.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కడం వంటి కారణాలతో ఈ మూవీ అన్ని ఇండస్ట్రీలతో పాటు దేశ వ్యాప్తంగా ఎంతో మంది దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా మేకింగ్ కూడా దాదాపు రెండేళ్ల పాటు సాగింది. మధ్య మధ్యలో కొన్ని అవాంతరాలు ఏర్పడడం వల్ల ఈ పరిస్థితి ఎదురైంది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు ఊహించని ఫలితం ఎదురైంది. తాజాగా 'సైరా' గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్..? పూర్తి వివరాల్లోకి వెళితే...

  తండ్రి కోసం రిస్క్ తీసుకున్న రామ్ చరణ్

  తండ్రి కోసం రిస్క్ తీసుకున్న రామ్ చరణ్

  ‘ఖైదీ నెంబర్ 150'తో సెకెండ్ ఇన్నింగ్స్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా తర్వాత తన తండ్రితో ప్రతిష్టాత్మక చిత్రం తీయాలని రామ్ చరణ్ ‘సైరా: నరసింహారెడ్డి'ని ప్రారంభించారు. దీనికి స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం నిరాశను మిగిల్చాయి.

  మన సినిమా అన్నారు.. కలెక్ట్ చేసింది మాత్రం

  మన సినిమా అన్నారు.. కలెక్ట్ చేసింది మాత్రం

  టాలీవుడ్‌లోనే భారీ సినిమాగా వచ్చిన ‘సైరా: నరసింహారెడ్డి' అనుకున్న స్థాయిలో ఫలితాన్ని రాబట్టలేకపోయింది. రేనాటి సూర్యుడి జీవిత కథ అని ప్రచారం చేయడం కలిసొచ్చినప్పటికీ కాసులను మాత్రం కురిపించలేకపోయింది. ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో కలిపి మొత్తంగా రూ. 130 కోట్లు పైగా షేర్ సంపాదించింది. గ్రాస్ కూడా రూ. 300 కోట్లు పైగా తన ఖాతాలో వేసుకుంది.

  అంతకు అమ్మితే.. ఇంత వచ్చింది

  అంతకు అమ్మితే.. ఇంత వచ్చింది

  భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా కావడంతో ‘సైరా: నరసింహారెడ్డి' ప్రీ రిలీజ్ బిజినెస్ అత్యధికంగానే జరిగింది. అన్ని ఏరియాలు, డిజిటల్, శాటిలైట్ రైట్స్ అన్నీ కలుపుకుని రూ.152.9 కోట్లకు ఈ సినిమా అమ్ముడుపోయింది. కానీ, కలెక్షన్ల పరంగా మాత్రం లోటును మిగిల్చింది. ‘సైరా' కలెక్షన్లు రూ.133 కోట్ల వద్ద ఆగిపోవడంతో రూ. 20 కోట్లు వరకు నష్టం వచ్చింది.

   ఆ ఒక్క దానికే రూ. 40 కోట్లు చెల్లించిన చరణ్

  ఆ ఒక్క దానికే రూ. 40 కోట్లు చెల్లించిన చరణ్

  ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందింది. తన తండ్రి సినిమా కావడంతో రామ్ చరణ్ కూడా ఖర్చు పెట్టడానికి ఏమాత్రం వెనుకాడలేదు. దీంతో ఈ సినిమా వినోదపు పన్ను కూడా భారీగానే చెల్లించాల్సి వచ్చిందని తాజాగా ఇండస్ట్రీలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మొత్తంగా ఈ సినిమాకు వినోదపు పన్నుగా రూ. 40 కోట్లు చెల్లించాడట నిర్మాత రామ్ చరణ్.

  సినిమా ఫలితంపై ప్రభావం చూపించింది

  సినిమా ఫలితంపై ప్రభావం చూపించింది

  ‘సైరా: నరసింహారెడ్డి' దాదాపు రూ. 20 కోట్లకు పైగా నష్టాలను మూటగట్టకుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పన్నును తగ్గించడమో.. లేక మినహాయింపు ఇవ్వడమో చేసినట్లైతే నష్టాలు రాకపోగా.. లాభాలను ఆర్జించే అవకాశం ఉండేదని అంటున్నారు. దీంతో ఇది చర్చనీయాంశం అవుతోంది.

  గతంలో చాలా సార్లు జరిగింది

  గతంలో చాలా సార్లు జరిగింది

  గతంలో కొన్ని సినిమాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను మినహాయింపుకు చర్యలు తీసుకున్నాయి. అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన ‘రుద్రమదేవి'కి తెలంగాణ ప్రభుత్వం, నందమూరి బాలకృష్ణ నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణికి' రెండు ప్రభుత్వాలు పన్ను మినహాయింపు ప్రకటించాయి. ‘సైరా' కూడా స్వాతంత్ర సమరయోధుడి బయోపిక్ కావడంతో దీనికి కూడా అలానే జరుగుతుందని అనుకున్నారు. కానీ, దీనిపై ఏ ప్రభుత్వామూ స్పందించలేదు.

  English summary
  Sye Raa Narasimha Reddy is a 2019 Indian Telugu-language epic action film directed by Surender Reddy and produced by Ram Charan under the Konidela Production Company banner. A work of fiction, the film is inspired by the life of Indian independence activist Uyyalawada Narasimha Reddy from the Rayalaseema region of Andhra Pradesh.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X